Health Tips: ప్రస్తుతం ప్రతి ఒక్కరికి గుండె సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. చాలావరకు ఈ గుండెపోటు సమస్య ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. రోజురోజుకు ఈ సమస్యతో బాధపడే వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు. ఈ సమస్యలు రావటానికి కారణం అనారోగ్యకరమైన ఆహారం, అతిగా వ్యాయామలు చేయడం వంటి ఇతర విధివిధానాల వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఈ సమస్య ఎప్పుడొస్తుందో అనేది చాలావరకు ఎవరికీ తెలియదు. కానీ కొన్ని నొప్పుల వల్ల గుండెపోటు వస్తుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇంతకూ అవేంటో తెలుసుకుందాం.
ఛాతి నొప్పి: గుండెపోటు వచ్చేవారిలో ఛాతినొప్పి అనేది బాగా వస్తుంది. ఛాతి మధ్యలో ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల గుండెనొప్పి వస్తుంది. ముఖ్యంగా ఎడమవైపు నుంచి భారీ నొప్పి ఉంటుంది. ఇక అక్కడి నుంచి భుజాలకు, చేతులకు వ్యాపిస్తుంది.
ఎడమ చేతి నొప్పి: గుండె కండరాలకు రక్తప్రసరణను అడ్డుకోవడం వల్ల గుండెపోటు వస్తుంది. ఇక దీనివల్ల ఎడమచేతి నొప్పి కూడా కలుగుతుంది.
దవడ నొప్పి: గుండె నొప్పి కారణానికి దవడ నొప్పి కూడా ప్రధానమైంది. పంటి నొప్పి కంటే ఎక్కువగా ఉంటుంది.
Health Tips:
వెన్ను నొప్పి: వెన్ను నొప్పి కూడా ముఖ్యమైన సంకేతం అని చెప్పాలి. ముఖ్యంగా స్త్రీలల్లో గుండెపోటు సమస్యల ముందు వెన్ను నొప్పి తీవ్రంగా వస్తుంది.
మెడ నొప్పి: గుండె కండరాలలోకి రక్త ప్రవాహం ఆగిపోవడం వల్ల, రక్తం గడ్డ కట్టడం వల్ల కూడా గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. ఈ నొప్పి అనేది మెడకు కూడా వ్యాపిస్తుంది. దీని వల్ల మెడ అలసటగా ఉంటుంది.
భుజం నొప్పి: ఇక ఈ నొప్పులే కాకుండా భుజం నొప్పి కూడా ఎక్కువగా వస్తుంది. పై నుండి వచ్చే నొప్పుల ప్రభావం భుజంపై కూడా బాగా పడుతుంది. కాబట్టి ఈ సూచనలు ఉంటే వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి.