Health Tips: ప్రస్తుత పరిస్థితుల్లో.. కరోనా వైరస్ తగ్గినప్పటికీ దాని ప్రభావం మన శరీరాన్ని అంతగా వదిలిపోవడం లేదు. ఏ నిమిషం ఏ అవయవం మీద దెబ్బ కొడుతుందో తెలియటం లేదు. అందుకే ఏ చిన్న అనారోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు అంటున్నారు వైద్యులు. అందులో ముఖ్యంగా ఊపిరితిత్తులు గురించి శ్రద్ధ మరింత ఎక్కువ తీసుకోమంటున్నారు.
ఎందుకంటే కరోనా వైరస్ ప్రభావం గుండె తరువాత ఎక్కువగా వాటి మీదే కనిపిస్తుంది. ఊపిరితిత్తుల సమస్యను మనం గ్రహించటానికి కొన్ని లక్షణాలు ఉంటాయని వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల చాలామంది గుర్తించలేరని వైద్యులు చెప్తున్నారు. ఊపిరితిత్తుల సమస్యకి ఉండే లక్షణాలని అవగాహన కోసం తెలియజేస్తున్నారు.
కఫం మామూలుగానే అందరికీ ఉంటుంది అయితే ఇది వచ్చిన ఒక మూడు నాలుగు రోజుల కల్లా మళ్లీ అదే సర్దుకుంటుంది. కానీ అదే కఫం నెలరోజులు దాటినా కూడా తగ్గలేదు అంటే ఊపిరితిత్తుల్లో సమస్య తలెత్తినట్లే. మరో ముఖ్య లక్షణం శ్వాసలో తేడా, మీరు శ్వాస తీసుకునేటప్పుడు ఇబ్బందిగా అనిపించిన, భారంగా అనిపించిన అది కూడా ఊపిరితిత్తుల సమస్యకు దారి తీయవచ్చు.
ఎందుకంటే ఊపిరితిత్తులలో కనితి కార్సినోమా నుంచి ద్రవం ఏర్పడటం వలన గాలి పీల్చుకోవటానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి శ్వాస సమస్యను తేలిగ్గా తీసుకోకండి. తక్కువ సమయంలో ఎక్కువ బరువు కోల్పోవడం కూడా ఊపిరితిత్తుల సమస్యకి కారణం కావచ్చు. మీ ఊపిరితిత్తులు పాడవుతున్నట్లుగా మీ శరీరం మీకు అందిస్తున్న సమాచారం అది గ్రహించండి.
చాతి నొప్పి దీర్ఘకాలికంగా ఉన్నా, ఊపిరి పిలిచినప్పుడు దగ్గు వచ్చిన కూడా ఊపిరితిత్తులు ప్రమాదంలో ఉన్నాయని గుర్తించండి. అలాగే వారాల తరబడి రక్తచార్యులతో కూడిన దగ్గు వస్తున్నట్లయితే అదికూడా ఊపిరితిత్తుల సమస్యకి సంకేతమే. వీటి మీద కొంచెం దృష్టి పెడితే ఊపిరితిత్తులు పూర్తిగా ప్రమాదంలో పడకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు అయితే సమస్య వచ్చిన తర్వాత బాధపడటం కన్నా ముందే సమస్య రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోమంటున్నారు నిపుణులు.
వాటికి కొన్ని వ్యాయామలు కూడా సూచిస్తున్నారు అవేంటో చూద్దాం. అందులో ముఖ్యంగా బ్రీతింగ్ యాక్టివ్గా ఉంచుకోవడం దీనికి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలంటే కుర్చీలో కూర్చొని చేతులని పొత్తు కడుపు మీద ఉంచుకొని ప్రధాన శ్వాస కోసం కండరాలు కదిలేలా దీర్ఘ శ్వాస తీసుకోవాలి. మూడు సెకండ్ల పాటు గాలి పీల్చుకొని నాలుగు సెకండ్ల పాటు ఊపిరి బేకు పెట్టి నెమ్మదిగా ఊపిరి వదలాలి. ఈ ప్రక్రియలో గాలిని నోటి ద్వారా పీల్చుకొని ముక్కు ద్వారా వదలాలి.
రెండు మూడు నిమిషాల పాటు ఊపిరి బిగబట్టి తర్వాత వేగంగా గాలిని బయటికి వదలాలి. స్ట్రాలతో చేసే వ్యాయామం కూడా ఊపిరితిత్తులని బలంగా చేస్తుందంట అదెలాగో చూద్దాం. ముందు ముక్కుతో గాలి పీల్చుకొని స్ట్రా ద్వారా వదులుతూ గ్లాసులో నీటి బుడగలు సృష్టించాలి. తర్వాత నోట నుంచి స్ట్రా తీసేసి తిరిగి మళ్ళీ అదే వ్యాయామాన్ని కొనసాగించాలి. ఈ గాలి బుడగలు రావటం ముందు కొంచంగా వస్తాయి తర్వాత తర్వాత ఆ బుడగలని పెంచుకుంటూ పోవాలి.
Health Tips:
బెలూన్ ఊదటం కూడా ఊపిరితిత్తులకు మంచి వ్యాయామం. స్పైరోమీటర్ తో చేసే వ్యాయామం కూడా ఊపిరితిత్తులకు మంచి శక్తిని ఇస్తాయి. ఇందులో ఉండే బంతులు వీలైనంత పైకి లేచే వరకు గాలిని పీల్చుకోవాలి తర్వాత స్పైరోమీటర్ ని తలకిందులుగా చేసి అందులో బంతులు పైకి లేచేలాగా గాలిని వదలాలి. కానీ ఈ వ్యాయామం ఎక్కువ సమయం చేయకూడదు జాగ్రత్త వహించండి. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే, సమస్య తీవ్రంగా ఉంది అన్నప్పుడు వైద్యులను సంప్రదించటమే మంచిది.