Home Care : ఇంత తక్కువ ధరలో వాషింగ్ మెషీన్ తయారు చేసింది మన ఇండియన్ ఏ మరి.

S K

Home Care : ఇంత తక్కువ ధరలో వాషింగ్ మెషీన్ తయారు చేసింది మన ఇండియన్ ఏ మరి. సుమారు గా ఒక వాషింగ్ మిషన్ ధర 10 వేల నుండి మొదలవుతుంది.మంచి బ్రాండెడ్ వాషింగ్ మిషన్ అయితే 20 వేల నుండి 40 వెలా దాకా కూడా ఉన్నాయి. ఇలాంటి కారిధైన వాషింగ్ మిషన్ లు అందరూ కొనలెరు. కొన్ స్తోమత కలిగిన వారు కొనగలారు.లేనివారు వారి చేతి తో వారే తమ బట్టలను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. కొందరికి బట్టలు ఉతకడం వల్ల చేతులకు అలెర్జీ రావడం లాంటివి మరియు బుజం నొప్పి వంటివి వాస్తు ఉంటాయి. వాషింగ్ మిషన్ కొనాలి అని ఉన్న కొనలేని పరిస్థితి ఉంటుంది అలాంటి వారి కోసమే నవజ్యోత్ సహ్ని అనే వ్యక్తి లో- కాస్ట్ వాషింగ్ మెషిన్ లను తయారు చేసారు.నవజ్యోత్ లండన్ లో జన్మించారు. లండన్ లో జన్మించినప్పటికీ విరి కుటుంబం భారత దేశానికి చెందిన వారు.

వృత్తి రీత్యా  నవజ్యోత్ ఏరోనాటికల్ ఇంజనీర్. నవ జ్యోత్ ఒక సారి తమిళనాడు లోని కుయిలపాలయం లో ఒక గృహిణి నీ కలిశాడు.ఆమె పేరు దివ్య,ఆమె తన చేతులతో నే బట్టలను ఉతికేది.అల చేతులతోనే బట్టలను ఉతకడం వల్ల వెన్నునొప్పి మరియు స్కిన్ ఎలర్జీ తో ఆమె బాధ పడేది ఆమె బాధను చూసిన నవ జ్యోత్ తక్కువ కర్చు తో కూడిన వాషింగ్ మిషన్ నీ తయారు చేశాడు.ఈ వాషింగ్ మిషన్ కు కరెంట్ అవసరం లేదు మరియు తక్కువ నీరు సరిపోతుంది అని ఆయన అన్నారు.ఈ వాషింగ్ మిషన్ ధర కేవలం 5000నుండి 6000 మధ్య ఉంటుంది.నవజ్యోత్ తయారు చేసిన ఈ వాషింగ్ మెషీన్ ప్రపంచ వ్యాప్తంగా కార్పొరేట్ మరియు లాభాపేక్ష లేని సంస్థ ల నుండిఅనేక గ్రాంట్ లు మరియు అవార్డులు మరియు మద్దతు నీ పొందింది.

ఈ ప్రాజెక్ట్ ను అతను ఆగస్ట్ 2018 లో ప్రారంబించారు.ఇరాక్ మరియు లెబనాన్ లో150 కి పైగా వాషింగ్ మిషన్ లను తయారు చేశాడు.చలా కంపెనీ లు ఈ వాషింగ్ మిషన్ లను కొని పేదలను ఫ్రీ గా కూడా అందిస్తున్నారు.ఈ ప్రాజెక్ట్ లో 1,350 మంది కి పైగా వర్కర్స్ ఉన్నారు. నవజ్యోత్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ ఇలాంటి ఆవిష్కరణలను చేస్తున్నారు.అయన తన విశ్రాంతి సమయం లో పల్లెటూర్లో లో పర్యటించినప్పుడు వారి సమస్యలను చూసి చాలా బాధ కలిగింది అని అయన అన్నారు.ఆయనను ఆశ్చర్య పరిచిన విషయం ఏమిటి అంటే ప్రజలు వారి సమస్యలకు అలవాటు పడడం.నవజ్యోత మొదటవంట స్టౌ లను తయారు చేసేవారు.చలా మంది ఆడవాళ్ళు భోజనం సిద్ధం చేయడానికి కట్టెలు ఉపయోగించే వారు.ఆ కట్టెలను తేవడానికి వారు తరుచుగా అడివి లోకి వెళ్ళవలసి వచ్చేది అలాంటి ఆడవారి కోసం క్లీన్ వంట స్టౌ లను తయారు చేశారు.నవజ్యోత్ సలాడ్ స్పిన్నర్ సూత్రాల ఆధారంగా ఈ యంత్రాన్ని రూపొందించినట్టు తెలిపారు.ఇది ఒక వాష్ కు5 కిలోల సామర్థ్యం మరియు 500 rpm వరకు వేగం కలిగి ఉంటుంది అని అయన తెలిపారు.ఈ మెషీన్ రెండు సంవత్సరాల వారెంటీ తో 35 కేజీ. ల బరువుతో ఉంటుంది అని అయన తెలిపారు.ఇంతకీ ఈ వాషింగ్ మెషీన్ కు నవ జ్యోత్ పెట్టిన పేరు ఏమిటి అంటే “దివ్య 1.5”.

- Advertisement -