Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఈయన జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకొని వచ్చే ఎన్నికలలో ఇద్దరం కలిసి పోటీ చేయబోతున్నామని తెలియజేశారు. ఇలా ఈ రెండు పార్టీలు వచ్చే ఎన్నికలలో ప్రజల ముందుకు వస్తూ మంచి విజయాన్ని అందుకోవాలని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ చేతికి కనుక మనం గమనిస్తే ఆయన చేతికి నాగబంధం అలాగే కూర్మావతారంలో ఉన్నటువంటి ఉంగరాలు కనిపిస్తాయి.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఇలాంటి ఉంగరాలు ధరించడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ ఉంగరాలు గురించి చర్చలు మొదలుపెట్టారు. అసలు పవన్ కళ్యాణ్ ఈ ఉంగరాలు ఎందుకు ధరించారు అంటూ ఆరా తీస్తున్నారు. ఈ విధమైనటువంటి ఉంగరాలను ఎవరు పడితే వాళ్ళు ధరించకూడదు కేవలం మన జాతకం ఆధారంగా మాత్రమే ఇలాంటి ఉంగరాలను ధరించాలని పండితులు చెబుతున్నారు అయితే పవన్ కళ్యాణ్ ధరించిన నాగబంధం ఉంగరం ఏ విధమైనటువంటి అపమృత్యు దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అనుకోని విపత్తులు, గండాల నుంచి రక్షిస్తుంది. అలాగే ఎలాంటి దుష్ట శక్తులు మనపై పడకుండా ఈ ఉంగరం కాపాడుతుందని పురాణాలు చెబుతున్నాయి.
రాజకీయ యోగం కలుగుతుందా…
ఇక వీటితోపాటు నరదృష్టి రాహుకేతు దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇక వీటితో పాటు కూర్మావతారం ఉన్నటువంటి ఉంగరాన్ని కూడా పవన్ కళ్యాణ్ ధరించారు. ఈ ఉంగరం ధరించడం వల్ల అధికార, ధన యోగం సిద్ధిస్తుందనేది విశ్వాసం. అధికార యోగం రావాలంటే దైవబలం కావాలని ఆకాంక్షించే వారు.. ఇలాంటి కూర్మావతారం దరిస్తారా అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయపరంగా అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నారు అందుకే ఈయనకు జాతకం ప్రకారం మంచి జరగడం కోసమే ఈ ఉంగరాలను ధరించారని తెలుస్తుంది మరి ఉంగరాలు ధరించినటువంటి ఈయనకు నిజంగానే అధికార యోగం వస్తుందా రాజకీయపరంగా ఉన్నత స్థానంలో ఉంటారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది.