Icon Star Allu Arjun ఆ విషయంలో అల్లు అర్జున్ ని వాడేస్తున్న హైదరాబాద్ పోలీసులు… ఏంటంటే ?

Jaya Kumar

Icon Star Allu Arjun ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారని చెప్పాలి. గతేడాది అలా వైకుంఠపురంలో సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు బన్నీ. ఇక ఇటీవల ఆయన నటించిన ” పుష్ప ” సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సుకుమార్ దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. మునుపెన్నడూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపించాడు బన్నీ. ఇక మొదటి పార్ట్ కే విపరీతమైన రెస్పాన్స్ రావడంతో పార్ట్ 2 పైన అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో విపరీతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది పుష్ప. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బన్నీ నటనకు విమర్శకుల ప్రసంశలు దక్కుతున్నాయి. సినిమా తారలు కూడా బన్నీ నటనను తెగ పొగిడేస్తున్నారు. స‌మంత చేసిన ఊ అంటావా మావ పాట‌ కూడా ఒక సెన్సేషన్ గా మారింది.

ఇక క్రికెట‌ర్స్ అయితే పుష్ప ట్రాన్స్‌లో మునిగి తేలుతున్నారు. అతీశ్ ఖ‌ర‌డే అనే ట్రాఫిక్ పోలీస్ ఏకంగా శ్రీ వ‌ల్లి అనే పాట‌కు మ‌రాఠీలో లిరిక్స్ రాసి మ‌రీ ఆల‌పించాడు. అంత‌టితో ఆగ‌కుండా అచ్చం బ‌న్నీలాగే స్టెప్స్ వేశాడు కూడా. యూట్యూబ్ లో ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ కూడా వ‌చ్చింది. అలానే ప్రముఖ వాణిజ్య సంస్థ ‘అమూల్‌’ తన వ్యాపారం కోసం ‘పుష్పక్ ది స్లైస్‌… అమూల్ హావ్ స‌మ్ అమ్ములు, అర్జున్‌..’ అనే కార్టూన్‌ను షేర్‌ చేసింది. దీనికి బన్నీ కూడా స్పందించాడు. దీంతో ఆ వాణిజ్య ప్రకటన వైరల్‌గా మారింది.

తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసులు పుష్పరాజ్‌ను వాడటం ఆసక్తికరంగా మారింది. ద్విచక్రవాహనదారులు హెల్మెట్‌ను కచ్చితంగా ధరించాలనే నియమం గురించి ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నంలో భాగంగా పుష్ప సినిమాలో బైక్‌పై వెళుతున్న అల్లు అర్జున్‌ హెల్మెట్‌ ధరించి ఉన్నట్లుగా మార్ఫింగ్ చేశారు. ఆ ఫోటోపై ” త‌గ్గేదే లే ” అని రాసారు. ఈ ఫొటోని ట్రాఫిక్‌ పోలీస్‌ ట్విటర్‌ పేజీలో పోస్ట్ చేస్తూ… ‘హెల్మెట్‌ ధరించండి అది మిమ్మల్ని కాపాడుతుంది’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

- Advertisement -