Inspiring Story : ఈ ఆటోడ్రైవ‌ర్ ఇంగ్లీష్‌కు షాక్ అవ్వాలంతే..లెక్చ‌ర‌ర్ టూ ఆటోడ్రైవ‌ర్..జ‌ర్నీ కేక‌

Ra One

Inspiring Story ఈ ఆటోడ్రైవ‌ర్ ఇంగ్లీష్‌కు షాక్ అవ్వాలంతే..లెక్చ‌ర‌ర్ టూ ఆటోడ్రైవ‌ర్..జ‌ర్నీ కేక‌
బెంగళూరుకు చెందిన నికితా అయ్యర్ అనే ప్రొఫెషనల్ రోజూ లాగే డ్యూటీకి వెళ్తుంది. అయితే అనుకోకుండా హైవే మ‌ధ్య‌లో చిక్కుకుపోయింది. ఆ ప‌క్క‌నే ఉన్న ఆటోరిక్షా డ్రైవర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. ఆటోడ్రైవ‌ర్ కు 74 ఏళ్లుంటాయి. ఆటోడ్రైవ‌ర్ అద్బుతంగా ఇంగ్లీష్‌లో మాట్లాడుతుండ‌టంతో..నికితా అయ్యార్ ఆశ్చ‌ర్య‌పోయింది. ఇంత‌కీ ఆటోడ్రైవ‌ర్ అయిన ఆ ముస‌లాయ‌న ఇంగ్లీష్ లో అంతలా ఎలా ప‌ట్టు సాధించాడో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేసింది. సుమారు 45 నిమిషాల పాటు ఇద్ద‌రి మ‌ధ్య సంభాష‌ణ కొన‌సాగింది. స‌ద‌రు ఆటోడ్రైవ‌ర్ త‌న పూర్వ జీవితం గురించి ఇత‌ర విశేషాల గురించి షేర్ చేసుకున్నాడు.

ఈ విష‌య‌మై నికితా అయ్య‌ర్ ..నేను ఉదయం, నేను పనికి వెళ్తుండగా, హైవే మధ్యలో ఆటో చిక్కుకుపోయాను, నేను ఆటో రిక్షా నడుపుతున్న ఒక వృద్ధుడిని ఆపి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నానో చెప్పాను..ఆ త‌ర్వాత ఒక్క‌సారిగా షాక్‌కు లోన‌య్యా.. ఆటోడ్రైవ‌ర్ గురించి అని తన పోస్ట్‌లో రాసింది.

అయితే మొదట్లో కొంత‌అనుమానం వచ్చిన నికితా అయ్య‌ర్ నగరం చివరలో ఉన్న తన కార్యాలయానికి ఆల‌స్యంగా చేరుకునేలా ప్లాన్ చేసుకుంది. డ్రైవర్ ఇంగ్లీషులో స్పందించిన తీరు ఆమెను ఆశ్చర్యానికి గురిచేసింది.మిసెస్ అయ్యర్ ..మీరు ఇంత మంచి ఇంగ్లీషు ఎలా మాట్లాడారు అని ఆటోడ్రైవ‌ర్ ను అడిగినప్పుడు, ఆ వ్యక్తి తాను తాను MA, MEd చదివినట్లు ముంబై కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా ఉండేవాడని వెల్లడించాడు. ఆ త‌ర్వాత అయ్యర్ త‌న‌ను అడ‌గ‌బోయే తదుపరి ప్రశ్నను కూడా ముందే ఊహించాడు. ఆటోడ్రైవ‌ర్ ..నేను సరిగ్గా ఆటో ఎందుకు నడుపుతున్నాను అని మీరు నన్ను అడగబోతున్నారు? క‌దా అయ్య‌ర్ తో అన్నాడు.

Inspiring Story నా పేరు ప‌ట్టాభిరామ‌న్ అంటూ..

ఆమె నుంచి సానుకూల స్పంద‌న రావ‌డంతో స‌ద‌రు ఆటో డ్రైవర్ తన జీవిత విశేషాల‌ను చెప్ప‌డం మొద‌లు పెట్టాడు. తన పేరు ప‌ట్టాభి రామన్ అని, కాలేజీ లెక్చరర్‌గా పదవీ విరమణ చేసినప్పటి నుండి 14 సంవత్సరాలుగా ఆటో నడుపుతున్నానని చెప్పుకొచ్చాడు. తనకు కర్ణాటకలో ఉద్యోగాలు దొరకకపోవడంతో ముంబైలో లెక్చరర్‌గా పనిచేశానని రామన్ వెల్లడించారు. మీ కులం ఏంటి అని అడిగిపుడు..త‌న పేరు మిస్టర్ ప‌ట్టాభి రామన్ అని చెబుతార‌ని నాతో చెప్పిన‌ట్టు అయ్యర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

కర్ణాటకలోని కళాశాలల నుండి తనకు లభించిన ఆర్థిక‌ ప్రోత్సాహం విష‌యంలో విసుగు చెంది మహారాష్ట్రలోని ముంబైకి వెళ్లిన‌ట్టు చెప్పాడు ప‌ట్టాభిరామ‌న్. ఉపాధ్యాయులకు జీతం స‌రిగా లేదు. ఈ వృత్తిలో గరిష్టంగా 10 నుంచి 15,000/- సంపాదించవచ్చు. అది ప్రైవేట్ సంస్థ కాబట్టి, నాకు పెన్షన్ లేదు. రిక్షా నడపడం వ‌ల్ల నాకు రోజుకు కనీసం రూ.700-1500 లు వస్తుంది. నాకు, నా స్నేహితురాలికి ఇది సరిపోతుంది..అంటూ ప‌ట్టాభి రామ‌న్ నవ్వుతూ శ్రీమతి అయ్యర్‌తో చెప్పాడు.
72వేల‌కుపైగా లైక్‌లు..

నికితా అయ్యర్ శ్రీ రామన్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతూ..’జీవితం గురించి ఒక్క ఫిర్యాదు లేదు. ఒక్క పశ్చాత్తాపం లేదు. ఈ సీక్రెట్ హీరోల నుండి చాలా నేర్చుకోవాలి’ అని పోస్టులో రాసుకొచ్చింది. ఈ పోస్టుకు పెద్ద సంఖ్య‌లో నెటిజ‌న్లు త‌మ స్పంద‌న‌నుకామెంట్ల రూపంలో తెలిజేశారు. నాలుగు రోజుల క్రితం షేర్ చేసిన ఈ పోస్ట్ 72,000 లైక్‌లు, 2,300 కంటే ఎక్కువ షేర్ల‌తో వైరల్‌గా మారింది.

- Advertisement -