Rambha: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించినటువంటి వారిలో సీనియర్ నటి రంభ ఒకరు. ఇలా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రంభ అనంతరం వరుసగా ఫ్లాప్ సినిమాలను చవిచూస్తూ పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. తెలుగు తమిళ భాషలలో అగ్ర హీరోలందరి సరసన నటించినటువంటి ఈమె 2003 వ సంవత్సరం నుంచి వరుసగా డిజాస్టర్ సినిమాలను ఎదుర్కొన్నారు.
ఈ విధంగా సినిమా అవకాశాలు లేకపోవడంతో ఈమె ఇండస్ట్రీలో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలనే ఉద్దేశంతో నిర్మాతగా మారిపోయారు. ఇలా నిర్మాతగా మారినటువంటి రంభ త్రీ రోజెస్ అనే సినిమాని చేశారు. ఇందులో రంభ జ్యోతిక లైలా ముగ్గురు ప్రధాన పాత్రలలో నటించారు అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత భారీ డిజాస్టర్ గా నిలవడంతో తీవ్రమైన అప్పులు పాలయ్యారు. అయితే ఈ సినిమా చేయటం కోసం రంభ చెన్నైలో ఉన్నటువంటి ఓ బంగ్లాను తాకట్టు పెట్టారు. ఇక సినిమా డిజాస్టర్ అయ్యి అప్పుల వారు ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితులలో ఆ బంగ్లా అమ్మేశారు.
నిర్మాతగా మారి ఆస్తులు పోగొట్టుకున్నారా…
ఈ విధంగా బంగ్లా అమ్మినప్పటికీ తన అప్పులు తీరకపోవడంతో ఈమె పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కూడా చేశారు ఇలా సినిమాలలో సంపాదించి అప్పులు మొత్తం చెల్లించారు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో సంపాదించినటువంటి ఈమె ఒక్క సినిమా చేయడంతో తీవ్రంగా అప్పులు పాలయ్యి ఆస్తులను కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా అప్పులు మొత్తం తీరిన తర్వాత రంభ పెళ్లి చేసుకుని కెనడాలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఈమెకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు ఇలా భర్త పిల్లలతో రంభ తన జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది.