Sneha Reddy : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అల్లు కుటుంభానికి ఉన్నటువంటి క్రేజ్ గురించి సైన్ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే అప్పట్లో ప్రముఖ హాస్య నటుడు మరియు పద్మ శ్రీ అవార్డు గ్రహీత స్వర్గీయ నటుడు అల్లు రామలింగయ్య ఇండస్ట్రీలో కొన్ని వందల చిత్రాల్లో నటించడంతోపాటూ నిర్మాతగా కుడా వ్యవహరించాడు. ఆ తర్వాత తన వారసులుగా పరిచయమైన అల్లు అరవింద్ తిరుగులేని నిర్మాతగా రాణిస్తున్నారు. ఇక అల్లు కుటుంభం నుంచీ ఇండస్ట్రీ కి వచ్చిన అల్లు అర్జున్ అలాగే అల్లు శిరీష్ ఇద్దరూ బాగానే రాణిస్తున్నారు.
అయితే గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు. కాగా ఈ మధ్య స్నేహ రెడ్డి వరుస ఫోటో శూట్లలో పాల్గొంటూ అందమైన ఫొటోలకి పోజులిస్తోంది. అంతటితో ఆగకుండా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రోజురోజుకీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. అయితే ఇటీవలే స్నేహ రెడ్డి సంప్రాదాయ దుస్తులలో దిగినటు వంటి ఫోటోలను తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫోటోలు చుసిన నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయ్యారు.
అలాగే స్నేహ రెడ్డి కి హీరోయిన్ కి కావాల్సిన లక్షణాలు మెండుగా ఉన్నాయని హీరోయిన్ అయిపోవచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే పెల్ల్లయిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కానీ స్నేహ రెడ్డి మాత్రం హీరోయిన్ ఎంట్రీ పై వినిపిస్తున్న వార్తలపై మాత్రం స్పందించడం లేదు. అయితే తాజాగా స్నేహ రెడ్డి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే అల్లు అర్జున్ హీరోగా నట్టిస్తున్న పుష్ప చిత్రంలో ఓ కోయ జాతికి చెందిన గిరిజిన యువతి పాత్రలో నటిస్తోందట.
అలాగే ఈ మధ్య స్నేహ రెడ్డి కి సినిమా ఇండస్ట్రీ పై ఆసక్తి బాగా పెరిగిందని అందుకే పుష్ప 2 చిత్రంలో స్నేహ రెడ్డి పాత్ర కొంచెం పవర్ఫుల్ గా ఉండేట్లు డిజైన్ చేసినట్లు సమాచారం. కానీ ఇప్పటివరకూ ఈ విషయం పై ఇటు అల్లు స్నేహ రెడ్డిగానీ అటు చిత్ర యూనిట్ సభ్యులు గానీ స్పందించలేదు. దీంతో అల్లు స్నేహా రెడ్డి పుష్ప 2 చిత్రంలో నటిస్తున్నట్లు వినిపిస్తున్న వార్తలలో నిజమెంతుందనేది తెలియాల్సి ఉంది.