Shanthi Swaroop: ప్రస్తుత కాలంలో బుల్లితెర నటీనటులు కమెడియన్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున యూట్యూబ్ ఛానల్ లను ప్రారంభించుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే సోషల్ మీడియా ఖాతాల ద్వారా వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే వారికి సంతోషం వేసిన బాధ కలిగిన సమస్య వచ్చిన ఆ సమస్య గురించి కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. ఇలా సమస్య వచ్చింది అంటూ చాలా ఎమోషనల్ ఒక వీడియో చేసిన కొద్ది రోజులకే ఇల్లు కొన్నాం కారు కొన్నాం ఫ్లాట్ కొన్నామంటూ మరొక వీడియోని కూడా షేర్ చేస్తూ ఉంటారు.
ఇలా వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడం వల్ల కొన్నిసార్లు భారీగా అభిమానుల చేతిలో ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ప్రస్తుతం అలాంటి ట్రోలింగ్ కి గురయ్యారు జబర్దస్త్ కమెడియన్ శాంతి స్వరూప్. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా లేడీ గెటప్స్ లో ఎంతోమంది ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి శాంతి స్వరూప్ తాజాగా కొత్త కారును కొనుగోలు చేశాను అంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక వీడియోని షేర్ చేశారు. ఈ కారులో ఈయన ఎంతో ఎంజాయ్ చేస్తూ మై డ్రీమ్ కార్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
ఇల్లు అమ్మేస్తున్నాను…
ఇలా ఈయన కొత్త కారుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది ఈయనపై ట్రోల్స్ చేస్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం తన తల్లి ఆరోగ్యం బాగాలేదని చికిత్స చేయించడానికి డబ్బులు కూడా లేవు అంటూ ఈయన ఎమోషనల్ అవుతూ ఒక వీడియో చేశారు. తన తల్లిని బ్రతికించడం కోసం తనకు మంచి చికిత్స అందించడం కోసం తన ఇంటిని కూడా అమ్మేస్తున్నానని శాంతి స్వరూప్ ఎంతో ఎమోషనల్ వీడియో చేసిన సంగతి తెలిసిందే అయితే అమ్మకు బాగాలేదు ఇల్లు కూడా అమ్ముతున్నాను అని చెప్పిన కొద్ది రోజులకే కొత్త కారు ఎలా కొన్నావు? దీనికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటూ పలువురు ఈయనపై ట్రోల్స్ చేస్తున్నారు.