Sudheer – Rashmi బుల్లితెరపై సూపర్ జోడీగా పేరు తెచ్చుకున్నారు సుధీర్-రష్మి జంట. వీళ్లిద్దరి మధ్య వర్కౌట్ అయినట్టుగా మరే జంట మధ్య అంత కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు అంటే నిజమనే చెప్పాలి. అందుకే ఈటివి చానల్ లో ప్రసారమయ్యే ఈవెంట్ లలో పదే పదే వీళ్లిద్దరికీ పెళ్లి చేసేయ్యడం… వీరి లవ్ ట్రాక్ ను హైలైట్ చేస్తూ చూపించడం జరుగుతుంది. ఇటీవల జరిగిన ప్రోగ్రాం లో 9 ఇయర్స్ లవ్ అంటూ సెలబ్రేషన్స్ కూడా చేయడం గమనించవచ్చు. ఇక ఈ ఇద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారనే చర్చ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. అయితే తాజాగా జబర్దస్త్ కమెడియన్ సతీష్… ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరిద్దరి లవ్ ట్రాక్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేయడం గమనార్హం.
గతంలో చమ్మక్ చంద్ర, ముక్కు అవినాష్ టీంలలో సభ్యుడిగా చేసిన సతీష్… రష్మి – సుధీర్ ల లవ్ ట్రాక్‌పై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ” వీళ్లకి పనేం ఉండదు … పదే పదే రష్మి – సుధీర్‌ల మధ్య లవ్ ట్రాక్‌లు పెట్టి… రెండు ఆర్ ఆర్‌లు వేసి ఎఫెక్ట్‌లు పెడతారు. అది జనంలోకి వెళ్లిపోయి వీళ్ల మధ్యన ఏదో నడుస్తుందని బలంగా నమ్మేట్టు చేస్తారు. ఇటీవల నేను వైజాగ్ వెళ్తే ఒకరు నాతో… భయ్యా వాళ్లిద్దరూ కలవాలి అని అడుగుతున్నాడు. షూటింగ్ అయిపోయిన తరువాత వాళ్ల పని ఏదో వాళ్లు చేసుకుంటారు… అసలు రష్మికి పెళ్లైందన్న విషయం అతనికి తెలుసా… అలాగే సుధీర్‌కి పెళ్లి అయ్యిందో లేదో తెలుసా… వీళ్లిద్దరికీ రెండు క్లోజ్‌లు వేసి… పనికిమాలిన ఆర్ ఆర్‌లు వేస్తే వాళ్లకి పెళ్లి అయిపోతుందా అని మండిపడ్డాడు.
వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం… రేటింగ్ కోసం ఏదేదో చేస్తుంటారు. వీళ్లు జనాలను పిచ్చోళ్లని చేస్తున్నారు… అది ప్రజలు తెలుసుకోవడం లేదు అని అన్నాడు. టీవీ చూస్తుంటే మా ఇంట్లో వాళ్లు కూడా… ఈవారం వీళ్లిద్దరూ కలిసిపోతారట అని అంటున్నారు. వాళ్లేదో బతకడం కోసం… షో కోసం అలా చేస్తున్నారని … దానికి ఓ లవ్ ట్రాక్ పెట్టడం కరెక్ట్ కధాని తెలిపాడు. ఈ మధ్య డాన్స్ షోలలో కూడా లవ్ ట్రాక్ పెడుతున్నారని … జడ్జీ అంటే అదొక గౌరవం అని .. వాళ్లతో కూడా లవ్ ట్రాక్‌లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అనసూయ గారికి పెళ్లై, ఇద్దరు పిల్లలు ఉన్నారని … పొట్టి బట్టలు వేసుకున్నంత మాత్రాన ఏదో అనుకోవాల్సిన పనిలేదని చెప్పాడు. ఒక మహిళ ఫ్యామిలీని ఒప్పించి అలాంటి బట్టలు వేసుకుని షో చేస్తుందంటే… ఎంత మోటివేషన్ చేసి ఉండాలని … అలాంటి అనసూయకి కూడా లవ్ ట్రాక్‌లు పెట్టడం ఎంత వరకు న్యాయం అని చెప్పాడు. జనం చూసినంత కాలం వాళ్లు అలా చూపిస్తూనే ఉంటారని … సుధీర్ – రష్మి చచ్చిపోయే వరకూ కూడా కలవరని … అందుకు తాను గ్యారంటీ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.