Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా అవార్డును అందుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈయన నటించిన కొమరం భీం పాత్రకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమం దుబాయిలో జరిగిన సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్టీఆర్ సైమా అవార్డును అందుకొని వేదికపై అభిమానులను ఉద్దేశిస్తూ చేసినటువంటి ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ కొమరం భీం పాత్రకు నేను న్యాయం చేయగలను అని నన్ను నమ్మి మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం నాకు కల్పించిన జక్కన్నకు కృతజ్ఞతలు అలాగే నా కో స్టార్ నా ఫ్రెండ్ నా బ్రదర్ రామ్ చరణ్ కు కూడా ధన్యవాదాలు ఇక నా అభిమానులకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటాను అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నేను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని నేను కింద పడిన ప్రతిసారి అభిమానులు నన్ను పైకి నిలబెట్టారు.
పాదాభివందనాలు చేస్తున్నా…
నేను బాధపడితే వాళ్లు బాధపడ్డారు నా కంటిలో నుంచి కన్నీళ్లు కారితే వారి కళ్ళల్లో కూడా కన్నీళ్లు కారాయి. నేను నవ్వుతూ సంతోషంగా ఉన్నప్పుడు తన అభిమానులు కూడా సంతోషంలో ఉన్నారు. ఇలా నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి నా అభిమానులందరికీ సోదరులకు తలవంచి పాదాభివందనాలు చేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశిస్తూ చేసినటువంటి ఈ ఎమోషనల్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా కొమరం భీం పాత్రకు గాను ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకోవడంతో ఎన్టీఆర్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఈయన దేవర సినిమాలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.