Junior Ntr తెలుగు రాష్ట్రాల్లో తమ అభిమాన హీరో సినిమా విడుదలైతే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. అభిమాన హీరో సినిమా విడుదల సమయంలో థియేటర్ల దగ్గర సందడి చేస్తూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. అలాగే తమకు ఇష్టమైన హీరో పుట్టిన రోజులకు… రక్తదానాలు, అన్నదానాలు చేసి మంచి పేరు తెచ్చుకుంటూ ఉంటారు. అలానే అభిమానులు సమస్యల్లో ఉన్నారాణి తెలిసినప్పుడు వారికి ధైర్యం చెప్పి భరోసానిస్తారు మన హీరోలు. గతంలో చాలా మంది హీరోలు … ఆనారోగ్యంతో ఉన్న తమ అభిమానుల దగ్గరకు వెళ్లి స్వయంగా కలిసిన సందర్భాలున్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా … చావు బ్రతుకులా మధ్య ఉన్న తన అభిమాని కోరిక తీర్చారు.
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గుడపల్లి గ్రామానికి చెందిన కొప్పాడి మురళి… జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఐతే ఇటీవల మురళీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతనికి రెండు కిడ్నీలు దెబ్బతినడంతో పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. చావు బ్రతుకుల మధ్య ఉండి కూడా తన అభిమాన హీరోని చూడాలనే కోరికతో … ఆయన్ని చూడలని డాక్టర్లకు పేపర్ పై రాసిచ్చాడు. ఆస్పత్రి వైద్యులు ఎన్టీఆర్ అభిమాన సంఘాలను సంప్రదించారు. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్… మురళికి వీడియో కాల్ చేసి మాట్లాడారు. అతని ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసున్నారు. అతనికి అండగా ఉంటానని హామీ ఇచ్చి … త్వరలగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు.
తన అభిమాన కథానాయకుడు వీడియో కాల్ చేయడంతో మురళీ ఆనందపడిపోయాడు. మాట్లాడలేని స్థితిలో ఉన్నా సైగలు చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అభిమాని పట్ల ఎన్టీఆర్ చూపిన ప్రేమకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.