Rashmika: దరిద్రం నుంచి జస్ట్ మిస్ అయిన రష్మిక… ఆ ఒక్క సినిమా చేసుంటే కేరిర్ ఖతం?

Akashavani

Rashmika: కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఛలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు పొందారు. ఇలా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మిక వరుస బాలీవుడ్ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.ఈ విధంగా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మకు ఆల్ ఇండియా పర్మిట్ అనేలా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు.

ఇలా ఇప్పటికే మూడు బాలీవుడ్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి షూటింగులతో బిజీగా ఉన్న రష్మిక భారీ ఫ్లాప్ చిత్రం నుంచి బయటపడ్డారు. అసలేం జరిగింది అనే విషయానికి వస్తే..తెలుగులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన చిత్రం జెర్సీ. ఈ సినిమా తెలుగులో ఎంతో మంచి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాను హిందీలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే రీమేక్ చేశారు. ఇక ఈ సినిమాలో షాహిద్ కపూర్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు.

Rashmika: పాత్రకు వందశాతం న్యాయం చేయాలి….

తాజాగా ఈ సినిమా విడుదల అయి బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా డిజాస్టర్ నుంచి రష్మిక బయటపడిందని చెప్పాలి.అసలు విషయానికి వస్తే నిజానికి ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ స్థానంలో రష్మిక నటించాల్సి ఉంది.ఈ సినిమా కథ విన్న తర్వాత రష్మిక తాను ఇప్పటివరకు కమర్షియల్ చిత్రాలలో నటించాను ఇలాంటి సినిమాలలో నటిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా? నటన పరంగా ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయగలనా? ఇలాంటి పాత్రలకి తాను సూట్ అవుతానా? అనే సందేహాలు కలిగాయట. ఇలాంటి సందేహాలన్నీ తలెత్తడంతో రష్మిక ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పటికీ ఎంతో సున్నితంగా రిజెక్ట్ చేశారు. ఇలా రష్మిక ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేశారు.ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా విడుదల అయి బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన తర్వాత రష్మిక ఈ సినిమాలో నటించినకపోవడానికి అసలు కారణం తెలియజేయడంతో చాలామంది రష్మిక చాలా తెలివైనది ముందుగానే సినిమా ఫలితాన్ని అంచనా వేసింది అంటూ కామెంట్ చేస్తున్నారు.ఈ సినిమా కనుక చేసి ఉంటే బాలీవుడ్ డెబ్యూ మూవీనే డిజాస్టర్ గా ముద్ర వేసుకొని కెరీర్ మొత్తం నాశనం చేసుకొనేది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -