Keerthy Suresh: నేను పక్కన ఉన్న ఆయన రష్మికనే తల్చుకున్నాడు.. అతని సీక్రెట్స్ అన్ని చెప్పేసిన కీర్తి సురేష్!

Akashavani

Keerthy Suresh: తెలుగు రాష్ట్రాల ప్రజలకు కీర్తి సురేష్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. నేను శైలజ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులతో మంచిర్యాపో పెంచుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటనలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక తన అందంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ప్రస్తుతం కీర్తి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో తాను ఒకటిగా ఓ వెలుగు వెలుగుతుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఫుల్ బిజీ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ అప్డేట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ పరశురామ్ తెరకెక్కిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

కీర్తి సురేష్.. మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా కు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. నాకు మంచి అవకాశం ఇచ్చిన మైత్రి మూవీస్ కు ధన్యవాదాలు. కళావతి ను నాకు బహుమతిగా ఇచ్చినందుకు దర్శకుడు పరశురామ్ కి చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా మైత్రి నిర్మాతలకు, ఎకే ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూసర్లకు చాలా ధన్యవాదాలు అని తెలిపింది.

Keerthy Suresh: నేను పక్కన ఉన్న ఆయన రష్మికనే తల్చుకున్నాడు.. అతని సీక్రెట్స్ అన్ని చెప్పేసిన కీర్తి సురేష్!
Keerthy Suresh: నేను పక్కన ఉన్న ఆయన రష్మికనే తల్చుకున్నాడు.. అతని సీక్రెట్స్ అన్ని చెప్పేసిన కీర్తి సురేష్!

Keerthy Suresh: డైరెక్టర్ పరుశురామ్ గురించి కీర్తి సురేష్ బయటపెట్టిన విషయం ఇదే!

ఇక షూటింగ్ లో పరుశురామ్ నాతో పని చేస్తూ.. రష్మిక.. రష్మిక.. అంటూ రష్మిక మందన పేరును కలవరించేవారు. ఒకవేళ మీరు రష్మిక తో పనిచేసే ముందు మీరు కీర్తి అని పిలుస్తారా లేదా అని పరుశురాం గురించి కీర్తి సురేష్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేసింది.

ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ లు.. ఫస్ట్ లుక్ లతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమాలో కీర్తిసురేష్ గ్లామర్.. ఆ అంచనాలకు మరింత ఆజ్యం పోసినట్లు గా అనిపిస్తుంది. మరి ఈ నెల 12న సినిమా ప్రేక్షకుల్ని ఎంతగా మెప్పిస్తుందో చూడాలి.

- Advertisement -