Keerthy Suresh: సౌత్ సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి కీర్తి సురేష్ కూడా ఒకరు ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక కథ నచ్చితే తాను చెల్లెలు పాత్రలో కూడా నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఇదివరకే ఈమె చెప్పకనే చెప్పారు. ఈ క్రమంలోనే రజనీకాంత్ చిరంజీవి సినిమాలలో వారికి చెల్లెలుగా నటించారు. అయితే ఈ సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా నిలచాయి. మధ్యకాలంలో కీర్తి సురేష్ కెరియర్ కాస్త ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది.
ఇలా ఈమె నటించిన వరుస సినిమాలు డిజాస్టర్ కావడంతో ఈమె కెరియర్ కాస్త ఇబ్బందులలో పడిందని చెప్పాలి. అయితే త్వరలోనే కీర్తి సురేష్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా వెళ్లబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండడం కోసం ఈమె కూడా వేణు స్వామి చేత ప్రత్యేకంగా పూజలు చేయించుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇలాంటి వాటిని పెద్దగా నమ్మని కీర్తి సురేష్ వేణు స్వామి జత పూజలు చేయించుకోవడం ఏంటి అని కూడా ఆశ్చర్యపోతున్నారు.
సక్సెస్ కోసం ప్రత్యేక పూజలు..
ఇలాంటి పూజల పై తనకు ఏమాత్రం నమ్మకం లేనటువంటి కీర్తి సురేష్ ముందుగా వేణు స్వామితో పూజలు చేయించడానికి ఇష్టపడలేదట. కానీ తన తల్లి చెప్పిన దాని ప్రకారం తన తల్లి ఇష్టం మేరకే ఈమె కూడా వేణు స్వామికి తన జాతకాన్ని చూపించి జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే పరిహారం చేయాలని చెప్పారట. దీంతో తప్పనిసరి పరిస్థితులలో కీర్తి సురేష్ కూడా వేణు స్వామి చేత పూజలు చేయించుకున్నారని తెలుస్తోంది. మరి వేణు స్వామి చేత పూజలు చేయించుకున్న కీర్తి సురేష్ ఇకపై మంచి సక్సెస్ సినిమాలను అందుకుంటున్న లేదా అన్నది తెలియాల్సి ఉంది.