Kushboo: తెలుగు సినీ ప్రేక్షకులకు యాక్టర్ ఖుష్బూ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఈ భామ కలియుగ పాండవులు, పేకాట పాపారాయుడు, వంటి సినిమాల్లో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తన అందంతో అప్పటి ప్రేక్షకులను వేరే స్థాయిలో ఆకట్టుకుంది ఖుష్బూ. ఇక స్టాలిన్ సినిమాలో చిరంజీవి అక్క పాత్రలో ఖుష్బూ ప్రేక్షకులను వేరే స్థాయిలో ఆకట్టుకుంది.
చివరిగా 2018లో అజ్ఞాతవాసి సినిమా లో నటించిన సంగతి మనకు తెలుసు. మొత్తానికి తమిళ్ లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా నటిగా ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఖుష్బూ. ఇక తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని ఒక ఆసక్తికరమైన విషయం తెలిపింది. వెంకటేష్ తో కలిసి నటించిన కలియుగ పాండవులు చిత్రం షూటింగ్ టైమ్ లో ఆమె ఎదుర్కొన్న చేదు జ్ఞాపకాన్ని వెల్లడించింది.
ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీలో సాధారణంగా లైంగిక వేధింపుల గురించి మాట్లాడుతూ తాను అనుభవించిన ఒక చేదు అనుభవాన్ని బయట పెట్టింది. కలియుగ పాండవులు చిత్ర షూటింగ్ ఒక గ్రామంలో ముగించుకుని మేడపైకి మెట్లు ఎక్కుతున్న సమయంలో ఒక వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది.
Kushboo: అసభ్యంగా తాకడని చెంప పగలగొట్టిన ఖుష్బూ..!
వెనకాల ఉన్న ఒక వ్యక్తి ఆమె వెనుక భాగం పై తాగాడని వెంటనే అతని చెంప మీద గట్టిగా కొట్టానని ఖుష్బూ తెలిపింది. ఇక ఆ సమయంలో పక్కనే ఉన్న ఆ చిత్ర నిర్మాత డి.సురేష్ బాబు ఉన్నాడని అప్పుడు ఆయనతో పాటు ఆ షూటింగ్ లో ఉన్న కొందరు వ్యక్తులు ఆమెకు సపోర్ట్ చేసారని చెప్పుకొచ్చింది. ఇక ఖుష్బూ వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె ఒక ముస్లిం కుటుంబంలో పుట్టి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇక తమిల్ అభిమానులు ఆమె కోసం ఏకంగా గుడి కట్టారు. అప్పట్లో ఈ వార్త సంచలనంగా మారింది. ఇక పోతే ఆమె గొప్ప హేతువాది. ఆమెకు ప్రజల పట్ల, సమాజం పట్ల చాలా అవగాహన ఉంది.