Kriti Shetty: సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత సెలబ్రిటీల గురించి తరచూ ఏదో ఒక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడం సర్వసాధారణం. ముఖ్యంగా సెలబ్రిటీల ప్రేమలో పడటం బ్రేకప్ చెప్పుకోవడం వంటి వాటి గురించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే గత వారం రోజుల నుంచి నటి కృతి శెట్టి మెగా ఇంటికి కోడలు కాబోతుంది అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఉప్పెన సినిమా సమయంలోనే ఈమె హీరో వైష్ణవ్ తో ప్రేమలో పడ్డారని ఇప్పటికి వీరిద్దరూ తమ రహస్య ప్రేమ ప్రయాణం కొనసాగిస్తున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఈ విధంగా వీరిద్దరి ప్రేమ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తలపై కృతి శెట్టి టీం స్పందించారు. ఈ సందర్భంగా పెళ్లి వార్తలపై వారు మాట్లాడుతూ కృతి శెట్టి పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలియజేశారు .ఆమె మెగా ఇంటికి కోడలు కావడం లేదు అసలు ప్రస్తుతం తాను పెళ్లి గురించి ఆలోచన చేయడం లేదని తాను ఎవరితోనూ రిలేషన్ లో కూడా లేరు అంటూ తెలియజేశారు.
పెళ్లి వార్తలు పూర్తిగా ఆవాస్తవమే…
కృతి శెట్టి మెగా హీరోని పెళ్లి చేసుకోబోతుందని వస్తున్నటువంటి వార్తలలో ఏమాత్రం నిజం లేదు ఆ వార్తలన్నీ కూడా ఆ వాస్తవమేనని క్లారిటీ ఇచ్చారు. ఇలా ఈ టీం స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు చెక్ పడింది. ఇక ప్రస్తుతం ఈమె పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచన చేయలేదని తన దృష్టి మొత్తం సినిమాలపైనే పెట్టింది అంటూ కృతి శెట్టి టీం తన కెరీర్ గురించి అలాగే తన గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ మధ్యకాలంలో బేబమ్మ నటించిన తెలుగు సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ కావడంతో ఈమె తమిళ సినిమాలపై ఫోకస్ పెట్టారు మరి అక్కడైనా సక్సెస్ అందుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.