Bigg Boss బిగ్ బాస్ సీజన్ 5 … ఫైవ్ మచ్ గ్యారంటీ పక్కా అంటూ మరోసారి మనల్ని అలరిస్తుంది. ఈ సరి ఇంటి సభ్యులు వారిలోని అన్ని రకాల యాంగిల్స్ ని బయటపెడుతున్నారు. రెండో వారం నుంచే బూతు మాటలతో, కాంట్రవర్సి లతో, గొడవలతో ఈ సీజన్ కంటెస్టెంట్ లు చెలరేగుతున్నారు. అయితే తాజాగా జరుగుతున్న ఎపిసోడ్ లను గమనిస్తే… కంటెస్టెంట్ ల లోని మరో యాంగిల్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి సీజన్ లాగానే ఈ సీజన్ లో కూడా కంటెస్టెంట్ ల మధ్య లవ్ ట్రాక్ నడిపించేలా… బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే నాలుగు సీజన్ లలో లవ్ పేరుతో ప్రేక్షకులు మోసపోయారు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను పిచ్చోళ్లను చేయడానికి ఏ జంట సిద్ధం అవుతుందో చూద్దాం.

హమీదా – షణ్ముఖ్ – దీప్తి

దీప్తి సునయన – షణ్ముఖ్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిన విషయమే. నిన్న షణ్ముఖ్ పుట్టినరోజు సందర్భంగా దీప్తి బిగ్ బాస్ హౌస్ ముందు హంగామా చేస్తూ… గట్టిగా అరుస్తూ షన్ను హ్యాపీ బర్త్డే అని చెప్పడం నిన్నటి ఎపిసోడ్ లో గమనించవచ్చు. అలానే ” ఐ లవ్ యూ షన్ను” అంటూ దీప్తి పోస్ట్ చేసిన వీడియో ను బిగ్ బాస్ ప్రసారం చేయడంతో … షణ్ముఖ్ కూడా ఎమోషనల్ అవుతాడు.

ఇదిలా ఉండగా బిగ్ష బాస్ణ్ము హౌస్ఖ్ లో హమీదా గురించి మూడు వాక్యాల్లో చెప్పమని శంకుని అడిగితే హాట్ అని చెప్పి సిగ్గు పడతాడు. అప్పుడు హమీదా నా చేయి పట్టుకోని చెప్పు రా అని షణ్ముఖ్ ని అనడం… హౌస్ లో ఉన్నంత వరకు పిల్లో మీద డి తీసేసి… హెచ్ రాసుకో అని అంటుంది. ఇంటి నుంచి బయటికి వెళ్ళాక హెచ్ తీసేసి… డి రాసుకో అని షణ్ముఖ్ తో చెప్తుంది. ఈ మాటలకూ మీరు వినండి, మీరు చూడాలి అని రవి సరదాగా నవ్వుతూ అంటాడు.

మానస్ – లహరి

హౌస్ లో మరో జంట కూడా వారి రొమాన్స్ తో ఆకట్టుకుంటున్నారు. అర్ధరాత్రి సమయంలో మానస్ గిన్నెలు క్లీన్ చేస్తుండగా… అక్కడికి లహరి రావడం. కాసేపు తమ ఫేవరెట్ కలర్స్ గురించి మాట్లాడుకొని… గుడ్ నైట్ చెప్పుకుంటూ హగ్ చేసుకోవడంతో ఇంటి సభ్యులు షాక్ అవుతారు. ఆ తర్వాత కూడా లహరి మానస్ ను బెడ్ వరకు రమ్మని పిలిచి మరి… తన మైక్ తీసేసి కొన్ని సెకన్ల పాటు హగ్ చేసుకోవడం గమనార్హం. ఉదయం లేవగానే మళ్లీ ఇద్దరూ కలిసి ముచ్చట్లు పెట్టుకున్నారు.

శ్రీ రామ చంద్ర – హమీదా

వీళ్ల మధ్య కావాలనే కాంట్రవర్సి నడిపించడం కోసం బిగ్ బాస్ వీళ్ళని దగ్గరగా చుపిస్తున్నారో … ఏంటో అర్ధం కావట్లేదు. గడిచిన ఎపిసోడ్స్ లో వీరి మధ్య కాస్త రొమాన్స్ సీన్స్ బాగానే కనిపించాయి. హమీదా, శ్రీరామ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఉండగా… శ్రీరామ్, హమీదా వీపుకు మసాజ్ చేస్తూ ఉంటాడు. ఇక హమీదా మాట్లాడుతూ… నీ దగ్గర ఉండాలనిపిస్తుంది… మళ్లీ వద్దనుకొని దూరంగా ఉండాలి అనిపిస్తుంది అంటూ చెప్పడంతో వీరి మధ్య ఏదో ఉందని పలు వార్తలు వైరల్ అవుతున్నాయి . చివరకు బిగ్ బాస్ ఏ జంటను ఒకటి చేయనున్నారా త్వరలోనే తెలుసుకుందాం…

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Jaya Kumar

Hello All, This is Jaya Kumar an enthusiastic writer, I have completed my Journalism & Mass Communications from Acharya Nagarjuna University, Previously worked for ETV Andhra Pradesh & Public Vibe,...

Mail

Published on సెప్టెంబర్ 17, 2021 at 8:08 ఉద.