Mass Maharaj Raviteja మాస్ మహరాజ్ రవితేజ సినిమాలో అయిదుగురు హీరోయిన్లు… ఎవరెవరంటే ?

Jaya Kumar

Mass Maharaj Raviteja మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు ఈ హీరో. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. క్రాక్ సినిమా ఇచ్చిన కిక్ తో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టాడు రవితేజ. యంగ్ హీరోలు కూడా చేయలేనంత స్పీడ్ గా వరుస సినిమాల్లో నటిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాడు. ఒకేసారి ఏకంగా 5 సినిమాలను లైన్‌ లో పెట్టారు రవితేజ. వేటికవే విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మాస్ మహరాజ్.

ప్రస్తుతం రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న ఖిలాడి సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఇందులో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా… ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు కొత్త దర్శకుడు శరత్ మండవ తెరకెక్కిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రం మార్చి 25న విడుదల కానుంది. దాంతో పాటు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమాకు కమిట్ అయ్యాడు ఈయన. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఇక వీటితో పాటు విలక్షణ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే చిత్రంలో నటిస్తున్నారు రవితేజ. ఇందులో నెగెటివ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు రవితేజ. అక్కినేని మేనల్లుడు సుశాంత్ ఈ మూవీలో కీలక పాత్ర చేస్తున్నాడు. మెగాస్టార్ ముఖ్య అతిథిగా ఇటీవల ఈ సినిమా పూజ కార్యక్రమాలను నిర్వహించారు.

కాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు నటించబోతున్నారని సమాచారం అందుతుంది. వారు ఎవరంటే… అనూ ఇమాన్యుల్, తెలుగమ్మాయి పూజిత పొన్నాడ, జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాశ్, దక్ష నగర్కార్ అని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి. ఒకే సినిమాలో ఐదుగురు హీరోయిన్లు అంటే రొమాన్స్ మామూలుగా ఉండదు అని అంతా అంటున్నారు. స్వామి రారా తర్వాత సుధీర్ వర్మకు సరైన హిట్ లేదనే చెప్పాలి. దీంతో ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.

- Advertisement -