Chiranjeevi: వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే వీరి పెళ్లి విషయంలో కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉన్నప్పటికీ చిరంజీవి మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నారని తెలుస్తుంది. వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగినప్పటికీ మెగా బ్యాడ్ సెంటిమెంట్ అనేది చిరంజీవిలో కాస్త ఆందోళనకు గురి చేస్తుందని తెలుస్తుంది. ఇక వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి అనే విషయం తెలియడంతో వీరికి సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లావణ్య త్రిపాఠిలా పెళ్లి వేడుకను నెట్ ఫ్లిక్స్ కు ఎనిమిది కోట్లకు అమ్మేశారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు పై వరుణ్ తేజ్ స్పందిస్తూ అందులో ఏమాత్రం నిజం లేదని త్వరలోనే మా పెళ్లి వీడియోని ప్రతి ఒక్కరు చూస్తారని చెప్పుకోవచ్చారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు అంటూ మరో న్యూస్ వైరల్ అవుతుంది. మొదటి నుంచి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే ఆ బంధం ఎక్కువ కాలం నిలవదు. ముఖ్యంగా మెగా ఇంట్లో ఇదివరకు పవన్ కళ్యాణ్ హీరోయిన్ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
చిరంజీవిని వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్..
ఇకపోతే ఇప్పటికే శ్రీజ నిహారిక ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారు ఈ క్రమంలోనే హీరోయిన్ ని పెళ్లి చేసుకొని వరుణ్ తేజ్ కూడా ఎక్కడ విడాకుల వరకు వెళ్తారో అని భయపడుతూ మొదట్లోనే ఈ పెళ్లి వద్దని చెప్పినప్పటికీ వరుణ్ మాత్రం చాలా ఇష్టపడటంతో ఈ పెళ్లికి ఒప్పుకున్నారు అంటూ మరొక వార్త వైరల్ అవుతుంది. ఇలా వరుణ్ తేజ్ ఇష్టప్రకారమే వీరిద్దరి పెళ్లి ఎంతో ఘనంగా జరిపించారు అయితే వీరిద్దరూ చాలా సంతోషంగా ఉండాలని, అందరూ ఆశిస్తూ దీవిస్తున్నప్పటికీ చిరంజీవిలో మాత్రం ఎక్కడో ఏదో తెలియని భయం వెంటాడుతూ ఉందని మరొక వార్త వైరల్ అవుతుంది.