Megastar Chiranjeevi మహేష్ బాబుకి పోటీగా బాక్స్ ఆఫీస్ బరిలో మెగాస్టార్ చిరంజీవి… పోటీలో నెగ్గేదెవరో ?

Jaya Kumar

Megastar Chiranjeevi ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్లు మారింది టాలీవుడ్ పరిస్థితి. సంక్రాంతికి పెద్ద సినిమాలు సందడి చేస్తాయని అనుకుంటే… కరోనా దెబ్బకు రిలీజ్ కు రెడీ అయినా సినిమాలన్నీ వెనకడుగేశాయి. ఇటీవల అఖండ , పుష్ప లాంటి సినిమాలు విడుదలై సంచలన విజయాన్ని అందుకున్నాయి. ఆ ఊపులోనే సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలన్నీ విడుదలై టాలీవుడ్ కు పూర్వ వైభవాన్ని తీసుకువస్తాయని అంతా భావించారు. కానీ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్, ప్రభాస్ రాధేశ్యామ్, మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్, మహేష్ సర్కారు వారి పాట ఇలా భారీ సినిమాలన్నీ రిలీజ్ లను వాయిదా వేసుకున్నాయి.

దీంతో సంక్రాంతికి రావాల్సిన సినిమాలన్నీ ఇప్పుడు సమ్మర్ వైపు చూస్తున్నాయి. అన్నింటికన్నా ముందు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాను జనవరి 13న విడుదల చేయాలనుకున్నారు. అయితే అదే సమయంలో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ ఉండటంతో మహేష్ తన సినిమాను ఏప్రిల్ 1కి వాయిదా వేసుకున్నారు. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి తో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తోన్న భారీ చిత్రం ‘ఆచార్య’. నిన్న ఈ సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ను నిర్మాత‌లు మ‌రోసారి ప్ర‌క‌టించారు. ఉగాది సంద‌ర్భంగా ఆచార్య చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుద‌ల చేస్తున్న‌ట్లు తెలిపారు. నిజానికి ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రి 4న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తామ‌ని చెప్పారు. కానీ కోవిడ్ ప్ర‌భావం పెరుగుతూ రావ‌డంతో థియేట‌ర్స్ ప‌లు రాష్ట్రాల్లో మూసి వేయ‌డం… థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో ర‌న్ చేయ‌డం చేస్తున్నారు. థియేట‌ర్స్ స‌మ‌స్య త‌లెత్తే అవ‌కాశం ఉండ‌టంతో ఆచార్య సినిమాను ఫిబ్రవ‌రి 4న వాయిదా వేసి ఏప్రిల్ 1కి రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

అయితే ఆ తేదీకి మహేష్ సర్కారు వారి పాట సినిమా రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు. కాగా మహేష్ బాబు మోకాలికి సర్జరీ అవ్వడం… ఆ వెంటనే మహేష్ తో పాటు కీర్తి సురేష్, చిత్రయూనిట్ కరోనా బారిన పడటంతో షూటింగ్ కు బ్రేక్ వచ్చింది. ఇక ఇటీవల మహేష్ అన్న రమేష్ బాబు కన్నుమూయడంతో షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆచార్య టీమ్ ఈ డేట్ ను అనౌన్స్ చేయడంతో మహేష్ సినిమా మరోసారి వాయిదా పడటం ఖాయంగా కనిపిస్తుంది. మరి మహేష్ బాబు సర్కారు వారి పాట దసరా వరకు విడుదల అవుతుందో లేదా ఆ తర్వాతే విడుదల అవుతుందో చూడాలి. దీనిపై సర్కారు వారి పాట చిత్రయూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -