Father : ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు చూస్తే గడుస్తున్న కాలానికి అనుగుణంగా మానవ సంబంధాలు కూడా మారిపోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే పాశ్చాత్య దేశాలలో పాశ్చాత్య సంస్కృతి తో పాటు వికృత చేష్టలు కూడా ఎక్కువ అవుతున్నాయని కొన్ని సంఘటనలను చూస్తే బాగా అర్థమవుతుంది. అయితే ఓ మహిళ తన కూతురికి తండ్రిలా ఉంటాడని పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తి కాస్త తండ్రిలా చూసుకోవాల్సిందిపోయి, తన కూతురిని పెళ్లి చేసుకోవడంతోపాటు ఇద్దరు పిల్లలకి తండ్రి అయ్యాడు. ఈ వికృత ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక దేశంలోని లాస్ వెగాస్ పట్టణ పరిసర ప్రాంతంలో క్రిస్టి కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటుంది. అయితే క్రిస్టి తల్లిదండ్రుల మధ్య మనస్పర్ధలు విభేదాలు రావడంతో వీరిద్దరూ విడిపోయారు. అనంతరం క్రిస్టి గురించి ఆలోచించిన తన తల్లి తన కూతురు బాగోగులు చూసుకునేందుకు అలాగే ఆమెను సంరక్షించేందుకు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. కానీ క్రిస్టి క్రమక్రమంగా తండ్రుపై ప్రేమ పెంచుకుంది. ఈక్రమంలో తన తండ్రితో అక్రమ సంబంధాన్ని కూడా పెట్టుకుంది. ఆ తర్వాత ఈ తండ్రి కూతుళ్ళ బాగోతం గురించి తెలుసుకున్న క్రిస్టి తల్లి ఎంతగానో బాధపడింది. అలాగే ఇలాంటి నీచానికి పాల్పడిన ఇద్దరిని ఇంట్లో నుంచి గెంటేసే ప్రయత్నం కూడా చేసింది. కానీ వీరిద్దరి తీరు మాత్రం మారలేదు. దీంతో వీరిద్దరిని వదిలిపెట్టి దూరంగా వెళ్ళిపోయింది.
ఆ తర్వాత క్రిస్టి తన మాజీ తండ్రిని పెళ్లి చేసుకుంది. అంతేకాకుండా ఇద్దరు పిల్లలకి జన్మ కూడా ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయడంతో ఒక్కసారిగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో కొందరు ప్రేమ మోహంలో పడి తండ్రి, తల్లి, కూతురు, వంటి బంధాలను కూడా అపహాసం చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మనకంటూ కొన్ని కట్టుబాట్లు నియమ నిబంధనలు లేకపోతే లోకంలో బంధాలు విచ్ఛిన్నం అయిపోతాయని కూడా అంటున్నారు. మరికొందరు మాత్రం పాశ్చాత్య దేశాలలో ఇలాంటి ఫాస్ట్ కల్చర్ ఉంటుందని కానీ భారతదేశంలో మాత్రం ఇలాంటివి దాదాపుగా కనిపించవని అందుకే భారతదేశం చాలా గొప్పదని కీర్తిస్తున్నారు.