Tarakaratana Kids: స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా చంద్రబాబునాయుడు అరెస్ట్ అయి రిమాండ్ లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా అరెస్టు కావడంతో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు నారా నందమూరి కుటుంబ సభ్యులందరూ కూడా ఈయన అరెస్టును వ్యతిరేకిస్తూ తీవ్ర స్థాయిలో నిరసనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది పార్టీ కార్యకర్తలు అభిమానులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్న నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నందమూరి కుటుంబ వారసులుగా తారకరత్న కుటుంబం కూడా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా నిలబడింది.
తారకరత్నకు తన తాతయ్య స్థాపించిన తెలుగుదేశం పార్టీ అన్న చంద్రబాబు నాయుడు అన్న ఎంతో అమితమైనటువంటి గౌరవం ఉండేది అయితే ఈ గౌరవంతోనే తన తాతయ్య స్థాపించిన పార్టీలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని భావించారు. ఇలా లోకేష్ పాదయాత్రలో పాల్గొని ఆయనకు మద్దతు తెలిపినటువంటి తారకరత్న గుండెపోటుకి గురయ్యి మరణించిన సంగతి తెలిసిందే. ఇలా ఈయన మరణం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలోకి ముంచేసింది అయితే ఈ కుటుంబానికి చంద్రబాబు నాయుడు బాలకృష్ణ మద్దతుగా ఉంటామని వెల్లడించారు.
బాబుతోనే మేము…
ఇలా తమ కుటుంబానికి ఆత్మీయులు బంధువులు అయినటువంటి చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో తారకరత్న కుటుంబం కూడా ఆయన అరెస్టును వ్యతిరేకిస్తూ మద్దతు తెలియజేశారు. ఈ క్రమంలోనే తారకరత్న పిల్లలు ముగ్గురు కూడా ఈ అరెస్టును వ్యతిరేకిస్తూ చేతిలో ప్లకార్డులు పట్టుకొని ఉన్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బాబుతో మేము, ఈ పోరాటంలో మేమంతా మీ వెంటే అంటూ ఉన్నటువంటి ప్లకార్డులతో తారకరత్న పిల్లలు చంద్రబాబునాయుడుకి మద్దతు తెలియజేస్తూ ఉన్నటువంటి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా చిన్నారులు చంద్రబాబు నాయుడుకి మద్దతు తెలియజేయడంతో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
https://m.facebook.com/story.php?story_fbid=pfbid024Se1ujxpvCaDWuZrMka5FoWzaqc2MLautvw6sSy4emnw93QLgFZakqfh9vGxGXZsl&id=100064519097138&sfnsn=wiwspwa&mibextid=6aamW6