narappa movie making video trending
narappa movie making video trending

Narappa Making Video : నారప్ప సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అమెజాన్ ఓటీటీలో రిలీజ్ అయినా కూడా సంచలనాలను సృష్టించింది. ముఖ్యంగా సినిమాను మొత్తం విక్టరీ వెంకటేశ్ తన భుజాల మీద మోశారు. విక్టరీ వెంకటేశ్ నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. మొత్తానికి సినిమా ప్రస్తుతం విజయవంతంగా నడుస్తోంది. ఓటీటీలో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా అయితే నారప్పే. ఇదివరకు తెలుగు సినిమాలు చాలానే ఓటీటీల్లో రిలీజ్ అయినా కొన్ని సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. కానీ.. నారప్ప మాత్రం సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

narappa movie making video trending
narappa movie making video trending

నిజానికి ఈ సినిమాను తమిళ సినిమా అసురన్ ను రీమేక్ చేసి తీసిన సినిమా. ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ఒక పేద తండ్రి.. వ్యవసాయం చేసే తండ్రి.. తన పిల్లలను కాపాడుకోవడం కోసం ఏం చేశాడు అనేదే ఈ సినిమా.

Narappa Making Video : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న నారప్ప మేకింగ్ వీడియో

ఏ సినిమా అయినా సరే.. దాన్ని తీయడం అనేది అంత ఈజీ కాదు. ఆ సినిమా షూటింగ్ కోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఫైనల్ గా సినిమా ఉండేది రెండు గంటలే అయినా.. సినిమా తీయడం కోసం మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. తాజాగా నారప్ప సినిమా షూటింగ్ వీడియోను, మేకింగ్ వీడియోను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఆ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ముఖ్యంగా పోరాట దృశ్యాల్లో వెంకటేశ్ నటించిన తీరును చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన ఎంతో కష్టపడి పోరాట దృశ్యాల్లో నటించారు. మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 26, 2021 at 4:13 సా.