Niharika: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈమె జొన్నలగడ్డ వెంకట చైతన్యను పెళ్లి చేసుకున్న అనంతరం రెండు సంవత్సరాలకి తనకు విడాకులు ఇచ్చి విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి నిహారిక కెరియర్ పై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ఇక నిహారిక వ్యవహార శైలి నచ్చకపోవడంతోనే వెంకటచైతన్య తనకు విడాకులు ఇచ్చారు అంటూ ఒక వార్త వైరల్ అయింది. ఈ వార్తలకు అనుగుణంగానే వీరిద్దరు కూడా విడాకులు విషయాన్ని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.
ఇలా విడాకులు తీసుకున్నటువంటి నిహారిక రెండో పెళ్లికి కూడా సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈమె ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ తో ఎంతో చనువుగా ఉంటారు ఇలా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ చనువు కారణంగా ఇద్దరు ప్రేమలో ఉన్నారని వీరిద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే నిహారిక రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై ఈమె పరోక్షంగా స్పందిస్తూ ఈ వార్తలకు చెక్ పెట్టారు.
తమ్ముడితో సమానం…
యూట్యూబర్ నిఖిల్ పుట్టినరోజు కావడంతో నిహారిక అతనితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిహారిక స్పందిస్తూ యాంకరింగ్ నుంచి నటుడిగా మారావు. నటుడిగా కొనసాగుతున్నటువంటి నువ్వు నిర్మాతగా నా తమ్ముడిగా మారావు. మనిద్దరం కలిసి చాలా దూరం ప్రయాణించాము. లవ్ యు నిక్కి గ్రేట్ బర్త్ డే అంటూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ పోస్ట్ పై నిఖిల్ స్పందిస్తూ థాంక్యూ నీహా అంటూ రిప్లై ఇచ్చారు. ఇలా నిహారిక తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తను తమ్ముడుతో సమానమని చెప్పకనే చెప్పేశారు. దీంతో వీరిద్దరి గురించి వస్తున్నటువంటి వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.