NTR -Kalyan Ram: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టై మూడు రోజులు అవుతుంది. అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా చంద్రబాబు నాయుడు అరెస్టుపై స్పందిస్తూ ఖండిస్తున్నారు. కానీ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మాత్రం ఇప్పటివరకు ఎక్కడ ఈ విషయంపై స్పందించిన దాఖలాలు లేవు.
ఈ విధంగా సొంత మామయ్య అరెస్టు అయినప్పటికీ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ స్పందించకపోవడంతో పలువురు తెలుగుదేశం నేతలు వీరి వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ విధంగా ఎన్టీఆర్ స్పందించకపోవడం పై వైఎస్ఆర్సిపి నేతలు కూడా స్పందిస్తూ ఒకప్పుడు ఎన్టీఆర్ ను నారా, నందమూరి కుటుంబం ఎంతో అవమానించింది. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలలో అందరూ పాల్గొన్నప్పటికీ ఎన్టీఆర్ కి మాత్రం ఆహ్వానం అందలేదు అదేవిధంగా ఎన్టీఆర్ వంద రూపాయల నాణెం విడుదల చేసే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఎవరికీ కనిపించలేదు.
ఎన్టీఆర్ ఎందుకీ మౌనం…
ఇలా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన వెంటనే అందరికీ ఎన్టీఆర్ గుర్తుకు వచ్చారు అంటూ పలువురు ఎన్టీఆర్ పట్ల వస్తున్నటువంటి విమర్శలపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదు స్వయంగా ఆయనకు మామయ్య అలాగే తన తాతయ్య స్థాపించిన పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటికీ ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ స్పందించకపోవడంతో వీరిపై ట్రోల్స్ కూడా చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఎన్టీఆర్ స్పందిస్తారా లేకపోతే మౌనం వహిస్తారా ఈయన మౌనం దేనికి నిదర్శనం అంటూ కొందరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.