Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా ఎన్నో యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమంలోకి అడుగుపెట్టారు. ఇలా బిగ్ బాస్ ద్వారా మరింత మంది అభిమానులను సంపాదించుకుంటున్నటువంటి పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ కార్యక్రమము ద్వారా కాస్త నెగెటివిటీని కూడా ఎదుర్కొంటున్నారు. తాను ఒక్కసారైనా బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లాలన్నది తన కోరిక అంటూ పలు వీడియోలలో రిక్వెస్ట్ చేసుకున్నారు.
ఈయన విన్నపాన్ని మన్నించినటువంటి బిగ్ బాస్ నిర్వహకులు తనని బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి తీసుకువచ్చారు అయితే ఇక్కడ మాత్రం పల్లవి ప్రశాంత్ తన విశ్వరూపం చూపిస్తున్నారు. హౌస్ లోకి ప్రశాంత్ వెళ్లిన తర్వాత మరింత ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే ఈయనకు సెలబ్రిటీలు కూడా మద్దతు తెలియజేయడంతో ఈయన విన్నర్ గా గెలిచిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు అంటూ కొందరు భావిస్తున్నారు.
కోట్లు విలువ చేసే ఆస్తులు…
ఇలా బిగ్ బాస్ సెవెన్ కంటెస్టెంట్ గా హౌస్ లో కొనసాగుతున్నటువంటి పల్లవి ప్రశాంత్ ఆస్తుల గురించి ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈయన ఆస్తి విలువ కొన్ని కోట్ల రూపాయల విలువ చేస్తాయని తెలుస్తుంది. పల్లవి ప్రశాంత్ ఏకంగా 26 ఎకరాల పొలంతో పాటు లగ్జరీ ఇల్లు అలాగే కార్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇలా వ్యవసాయం చేస్తూనే యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి సోషల్ మీడియా ద్వారా కూడా భారీగా ఆదాయం పొందుతున్నట్టు సమాచారం. ఇలా రైతుబిడ్డ అయినప్పటికీ ఈయన కూడా కొన్ని కోట్ల రూపాయలకు అధిపతి అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.