pawan kalyan bheemla nayak movie making video
pawan kalyan bheemla nayak movie making video

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ళ్లీ సినిమాల‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు అనే స‌రికి ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన ప‌వ‌న్ ఈ సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన ‘పింక్’ రీమేక్‌గా ఇది రూపొందినప్పటికీ.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేస్తూ.. పవర్‌స్టార్‌ని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటారో.. అలాగే చూపించారు దర్శకుడు వేణు శ్రీరామ్ . ప్ర‌స్తుతం మూడు నాలుగు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాలు ఎప్పుడు విడుద‌లవుతాయేమోన‌ని అభిమానులు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు.

pawan kalyan bheemla nayak movie making video
pawan kalyan bheemla nayak movie making video

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు అనే సినిమాతో పాటు మలయాళం సూపర్‌హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమ‌లు క‌రోనా వ‌ల‌న ఆగిపోయాయి. అయితే ఇప్పుడు చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం కావ‌డంతో మూవీ నుండి క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. సోమవారం ఈ సినిమా నుంచి పవన్‌ ఫస్ట్‌లుక్‌ని వదిలారు. ఇందులో ఆయన ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా.. ఆ పాత్ర పేరు ‘భీమ్లా నాయక్’ అంటూ చిత్ర యూనిట్ వెల్లడించింది.

ఇక ఈ రోజు మేకింగ్ వీడియో విడుద‌ల చేస్తూ చిత్రం సంక్రాంతికి రానుంద‌ని క్లారిటీ ఇచ్చారు. మేకింగ్ వీడియోలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానాల‌కు సంబంధించిన ప‌వర్ ఫుల్ లుక్స్ విడుద‌ల చేయ‌గా, పోలీస్ డ్రెస్‌లో పవన్‌ని చూస్తే అభిమానులకు పూనకాలు రావాల్సిందే. అంత పవర్‌ఫుల్‌గా ఆయన కనిపిస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రస్తుతానికి ‘ప్రొడక్షన్ నెం.12’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు సాగర్‌ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. రానా ఓ కీలక పాత్రలో నటిస్తుండగా.. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత ప‌వ‌న్ .. క్రిష్ సినిమాను పూర్తి చేసి ఆ త‌ర్వాత హ‌రీష్ శంకర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఈ సినిమాపై కూడా భారీ అంచ‌నాలు నెల‌కొని ఉన్నాయి.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూలై 27, 2021 at 5:29 సా.