Pooja Hegde: పూజా హెగ్డే ఆ విషయంలో అసలు సంతృప్తి లేదట.. ఇదే బెస్ట్ అంటూ?

Akashavani

Pooja Hegde: సినీ ప్రియులకు పూజా హెగ్డే పేరు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఒక లైలా కోసం సినిమా తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత దువ్వాడ జగన్నాథం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరో లెవెల్ లో ఆకట్టుకుంది. ఇక ఆపై పలు స్టార్ హీరోల సరసన నటించింది అద్భుతమైన హిట్ లను తన సొంతం చేసుకుంది.

ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో తాను ఒకటిగా ఓ వెలుగు వెలుగుతుంది. ఇక ఈ బుట్ట బొమ్మ ఇటీవలే రాధే శ్యామ్ చిత్రం ద్వారా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను పలకరించింది. మొత్తానికి టాలీవుడ్ లో అటు బాలీవుడ్ లో చేతి నిండా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం కెరీర్ పరంగా మూడు పువ్వులు ఆరు కాయలు గా వ్యవహారిస్తుంది.

ఇక బాలీవుడ్ ప్రేక్షకులకు మంచి ర్యాపో పెంచుకున్న ఈ అమ్మడు. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి ఓ సినిమాలో నటించబోతుంది. అంతేకాకుండా పలు స్టార్ హీరోలతో టాలీవుడ్ లో ఆఫర్లు చేజిక్కించుకున్న ట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో పూజ బాలీవుడ్లో వరుసగా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వస్తున్నాయి.

Pooja Hegde: పూజా హెగ్డే ఆ విషయంలో అసలు సంతృప్తి లేదట.. ఇదే బెస్ట్ అంటూ?
Pooja Hegde: పూజా హెగ్డే ఆ విషయంలో అసలు సంతృప్తి లేదట.. ఇదే బెస్ట్ అంటూ?

Pooja Hegde: పూజకు బాలీవుడ్ లో ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా.. తన మొదటి ప్రధాన్యత వీళ్ళకే!

కానీ హిందీ సినిమాల్లో నాకు హీరోయిన్ గా చాలా వరకు సంతృప్తి లేదు. హిందీ లో ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ కూడా నాకు దక్కాల్సిన గుర్తింపు నాకు దక్కడం లేదు. అందుకే అక్కడి నుంచి మెల్లగా సైడ్ అయ్యే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది. ఇక తెలుగు ఇండస్ట్రీ లోనే ఈ బుట్ట బొమ్మ మెలగాలని అనుకుంటున్నట్లు తెలిపింది.

ఇక బాలీవుడ్లో పెద్ద పెద్ద హీరోలతో సినీ ఆఫర్స్ వచ్చినా కూడా తన మొదటి ప్రాధాన్యత తెలుగు సినిమాలకు హీరోల కు మాత్రమే ఇస్తానని చెప్పుకు వచ్చింది. ఇక ఆమె తెలుగులోనే గుర్తింపు దక్కించుకున్నది కాబట్టి.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కొనసాగే ఆలోచనలో ఉన్నట్లు తెలిపింది.

- Advertisement -