Prabhas fans: అప్ డేట్ ఇస్తావా ఆత్మహత్య చేసుకోవాలా.. ప్రశాంత్ నీల్ కు ప్రభాస్ ఫ్యాన్ సుసైడ్ లెటర్!

Akashavani

Prabhas fans: సాధారణంగా ఫిలిమ్ ఇండస్ట్రీ అన్నాక ఫ్యాన్ వార్లు.. ఫ్యాన్స్ వార్నింగ్ లు అడపదడప జరుగుతూనే ఉంటాయి. ఆమధ్య త్రిబుల్ ఆర్ విడుదల ఈ సమయంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ ల అభిమానుల మధ్య మాటల యుద్ధం ఒక రేంజ్ లో జరిగింది. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ అభిమాని మరో లెవెల్ కి వెళ్లి సూసైడ్ లెటర్ తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను బెదిరించాడు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక వివరాల్లోకి వెళితే ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా హడావిడి చేస్తున్నాడు. కాగా ప్రభాస్ ఆది పురుష్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్నాడు.

ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వస్తున్న ప్రభాస్ ప్రాజెక్ట్ కే కూడా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ప్రభాస్ రెండు చిత్రాలే కాకుండా సలార్ మూవీలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కే జి ఎఫ్ సిరీస్ తో ప్రపంచ స్థాయిలో ఫేమ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ సలార్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. మొత్తానికి ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా మెప్పించెబోతుంది.

ఇక ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఆ క్రమంలో కేజిఎఫ్ 2 విడుదల కావడంతో సలార్ షూటింగ్ లో ఆలస్యం జరిగింది. కాగా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి సింగిల్ అప్ డేట్ కూడ ఇవ్వలేదు.

Prabhas fans: ప్రభాస్ ఫ్యాన్ ప్రశాంత్ నీల్ కు సూసైడ్ నోట్ ఈ విధంగా రాశాడు!

దీని ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేని ప్రభాస్ ఫ్యాన్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు సూసైడ్ నోట్ రాశాడు. సలార్ మూవీకు సంబంధించిన గ్లింప్స్ ను మే నెలలో విడుదల చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నట్లు ఆ లెటర్లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ లెటర్ నెట్టింట్లో వైరల్ గా మారింది.

- Advertisement -