Prabhas : ప్రభాస్ రాజు..హీరో అవుతాడని ఎవరూ అనుకోలేదు. అవ్వాలని ఆయన ప్రయత్నించలేదు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో గానీ ఆ దిశగా ప్రయత్నాలు గానీ ఈరోజు పాన్ ఇండియన్ స్టార్‌గా వెలుగుతున్న ప్రభాస్ కెరీర్ ప్లాన్ చేసుకోలేదు. ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్‌జీ ఓ మాస్ ఎంటర్‌టైనర్ సినిమా చేయాలని రెడీ అవుతున్నాడు. ప్రముఖ నటుడు అశోక్ కుమార్ నిర్మాత. కథ ప్రకారం ఓ కొత్త కుర్రాడు అయితే సినిమాకి మంచి మైలేజ్ ఉంటుందని దర్శక, నిర్మాతలు ట్రై చేస్తున్నారు.
అప్పటికే చాలా మందిని ట్రై చేశారు. కానీ వీళ్ళు అనుకున్న కథలో సెట్ అవడం లేదట. ఓ రోజు జూబ్లీహిల్స్‌లో కాఫీ షాప్‌కి దర్శకుడు జయంత్ వెళ్ళాడు. అక్కడ ప్రభాస్ కాఫీ తాగుతూ కనిపించాడు. అంతే సెకండ్ థాట్ లేకుండా ఇతనే హీరో అని మైండ్‌లో ఫిక్సైయ్యాడు. తీరా ఎంక్వైరీ చేస్తే అతను కృష్ణంరాజు తమ్ముడు కొడుకు అని తెలిసింది. అంతే ఈ ప్రాజెక్ట్‌కి ఇంతకన్నా ఇంకేం కావాలి. వెంటనే ప్రభాస్‌కి వైజాగ్ సత్యానంద్ గారి దగ్గర కొన్నాళ్ళు శిక్షణ ఇప్పించారు. ఫైనల్‌గా ఈశ్వర్ సినిమా మొదలైంది.
Prabhas : పాన్ ఇండియన్ స్టార్‌గా టాలీవుడ్‌లో క్రేజ్ సాధించిన ఒకే ఒక్క హీరో ప్రభాస్.
మొదటిరోజు కటౌట్ పరంగా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. అంతకు మించి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇంత పొడవున్నాడు..డాన్సులు చేయగలడా..బాగా సిగ్గు, మొహమాటం..హీరోయిన్స్‌తో రొమాన్స్ చేసే సీన్స్ చేయగలడా..ఫైట్స్ అంటే గాల్లో లేచి విలన్స్‌ని కొట్టాలి..అది చేస్తాడా..ఇలా రకరకాల కామెంట్స్. కటౌట్స్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్. తర్వాత ప్రభాస్‌ను చూసి అందరూ చెప్పుకున్నారు. వర్షం తర్వాత స్టార్ హీరో ఇమేజ్ వచ్చింది. మిర్చి, బాహుబలి కథలు ప్రభాస్ కోసమే తయారయ్యాయి. బాహుబలి తర్వాత పాన్ ఇండియన్ స్టార్‌గా టాలీవుడ్‌లో క్రేజ్ సాధించిన ఒకే ఒక్క హీరో ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్ కోసం ఏకంగా వందల కోట్ల బడ్జెట్‌తో ప్రపంచ వ్యాప్తంగా రిలీజయ్యే పాన్ ఇండియన్ సినిమాలు తయారవుతున్నాయి. అదీ డార్లింగ్ ప్రభాస్ స్టామినా.