Rajamouli: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శక దీరుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ రాజమౌళి ఒకరు. దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ఇప్పటివరకు ఒక అపజయం కూడా ఎదుర్కోలేదు ఇలా అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రాజమౌళి తాజాగా త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా అంతర్జాతీయ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం విశేషం.
ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆఫ్రికా అడవులలో ఒక అడ్వెంచర్స్ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులలో రచయిత విజయేంద్ర ప్రసాద్ బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి హీరోలకు ఎంతో మంచి సక్సెస్ అందించినటువంటి రాజమౌళి మహేష్ బాబుకి కూడా అదే స్థాయిలో సక్సెస్ అందిస్తారని అభిమానులు అందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఏ పని చేసినా సక్సెస్ అందుకోలేరా…
అయితే తాజాగా రాజమౌళి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. దీంతో మహేష్ అభిమానులలో కూడా కలవరపాటు మొదలైంది. రాజమౌళి జాతకరీత్యా రెండేళ్ల పాటు ఆయనకు ఏమాత్రం కలిసి రాదని ఈ సమయంలో ఏ పని చేసిన సక్సెస్ కాలేరు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ సమయంలో మహేష్ బాబు సినిమా మొదలు పెడితే ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ కాదేమో అంటూ మహేష్ బాబు అభిమానులు రాజమౌళి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై కలవర పడుతున్నారు అయితే ఇవన్నీ ఫేక్ అంటూ మరికొందరు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నారు.