Rajendra Prasad : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కామెడి సినిమాలకి కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన హీరో నటకిరిటీ డా.రాజేంద్ర ప్రసాద్. ఆయన సినిమాలలోకి వచ్చినప్పటి నుంచి కామెడి ప్రధానంగా తెరకెక్కే సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. నందమూరి తారక రామారావు గారి ఎంకరేజ్ మెంట్‌తో నటుడుగా మారాడు.
ఏదైనా పర్‌ఫెక్ట్‌గా చేయాలనుకునే వ్యక్తి రాజేంద్ర ప్రసాద్. మంచి చదువు ఉన్నప్పటికి ఎన్.టి.ఆర్ ని చూసి నటుడవ్వాలనుకున్నాడు. ఆయన సలహాతో దేవదాసు కనకాల గారి యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యారు. మైం యాక్టింగ్ లో కూడా పట్టా పొందారు. కెరీర్ ప్రారంభం నుంచి వరుస అవకాశాలతో బిజీ అయ్యారు.
అప్పటికే ఇండస్ట్రీలో చాలామంది హీరోలుండటంతో ఏ తరహా సినిమాలు చేయాలనే డైలమాలో రాజేంద్ర ప్రసాద్ ఎన్.టి.ఆర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన ..ఇప్పటివరకు సినిమాలో ఒక కామెడీ ట్రాక్ ఉంది. కొంతమంది కెండియన్స్ మాత్రమే ఆ సీన్స్ చేయడానికి పనికొస్తున్నారు. కానీ సినిమాకి పూర్తి స్థాయి కామెడీ హీరో అంటూ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు లేరు. నువ్వు అది క్రియేట్ చేయి. కామెడీ హీరోగా మారితే నీకంటూ ఒక ప్లేస్ ఉంటుందని సలహా ఇచ్చారు. ఆ రకంగా, ఆరోజు మొదలు పెట్టిన రాజేంద్రుడి సినీ ప్రయాణం ఇప్పటికి విజయవంతంగా కొనసాగుతోంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన ఆయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చాలా బిజీగా ఉన్నారు.
Rajendra Prasad : ఒకటి రెండు సార్లు ప్రయత్నాలు మొదలై విఫలమయ్యాయి.
అయితే రాజేంద్ర ప్రసాద్‌కి తీరని కోరికేదైనా ఉందంటే అది వాళ్ళ అబ్బాయి విషయంలోనే. రాజేంద్ర ప్రసాద్ గారి కొడుకు బాలాజి ప్రసాద్‌ని హీరోగా చేయాలని కోరిక. కానీ అది సాధ్యమవలేదు.
మధ్యలో ఒకటి రెండు సార్లు ప్రయత్నాలు మొదలై విఫలమయ్యాయి. గతంలో ఓసారి బాలాజీ ప్రసాద్ ని, రామోజీ రావు ఇండస్ట్రీకి పరిచయం చేసేందుకు ప్రయత్నాలు చేశారట. కానీ కుదరలేదు. యాక్టింగ్‌లో అతనికి అంతగా ఆసక్తి లేదనే మాట వినిపించింది. ఒకవేళ ఇండస్ట్రీకొచ్చిన సక్సెస్ కాకపోతే ఆ డ్యామేజ్ రాజేంద్ర ప్రసాద్‌కి జరిగే అవకాశాలున్నాయని ఓ టాక్ వినిపించింది. హీరో మెటీరియల్ కాదని కామెంట్స్ వినిపించాయి. అందువల్లే ఆయన హీరోకాలేకపోయాడనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. ఇక పోలికలో మాత్రం తండ్రిని తీసి పెట్టాడు బాలాజి ప్రసాద్. ప్రస్తుతం వ్యాపార రంగంలో బిజీగా ఉన్నాడు.