Ramcharan: తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందారు. ఇక మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ అందరి పట్ల ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా మెగా కుటుంబంలో ఏ ఫంక్షన్ జరిగినా రామ్ చరణ్ తప్పకుండా హాజరవుతారు ఇలా కుటుంబ సభ్యులందరితోను ఎంతో ప్రేమగా ఉండే ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
ఇలా అందరితోను ప్రేమగా ఉండే రామ్ చరణ్ గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రామ్ చరణ్ తన తండ్రి అంటే ఎంతో అమితమైన ప్రేమ కలిగి ఉందని మనకు తెలుస్తుంది అయితే ఈయన మాత్రం తన తండ్రి కంటే డబ్బుకి అధిక ప్రాధాన్యత ఇస్తారు అంటూ చిరంజీవి ఓ సందర్భంలో చెప్పినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకి స్వయంగా రామ్ చరణ్ నిర్మాతగా మారారు. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించారు.
రామ్ చరణ్ చిరంజీవిని తిడతారా..
ఈ సినిమా ప్రమోషన్లకు సంబంధించినటువంటి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా రామ్ చరణ్ కు మీరంటే ఎంతో అమితమైన ప్రేమ సార్ మీకు జ్వరం వస్తే కూడా తల్లడిల్లిపోతారు అంటూ వినాయక్ చెప్పగా రామ్ చరణ్ మాట్లాడుతూ మీకు అలా అనిపిస్తుంది కానీ వాడి బాధంతా ఏమీ లేదు నాకు జ్వరం వస్తే వాడు ఎక్కడ సినిమాలలో డబ్బు నష్టపోతాడు అని వాడి భయం అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. అలా ఏం కాదు సర్ మీరంటే చాలా ప్రేమ అని మరోసారి వినాయకు చెప్పగా ఇప్పుడు సినిమాలలో నష్టపోతే వాడు నామీదకి గొడవకు వస్తాడు నన్నే తిడతారు అంటూ సరదాగా చిరంజీవి చెప్పినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.