Rashmika Mandanna క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో యువత హృదయాలు కొల్లగొడుతున్న ” రష్మిక మందన్నా”…

Jaya Kumar

Rashmika Mandanna రష్మిక మందన్నా గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దగుమ్మ… వరుస విజయాలు అందుకుంటూ నేషనల్ క్రష్ గా మారింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన “గీతా గోవిందం”, డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటించి తక్కువ కాలంలోనే తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది ఈ కన్నడ బ్యూటీ. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇక ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించి అందర్నీ మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన సినిమా ” పుష్ప – ది రైజ్ “. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించి మెప్పించింది. అలానే బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో నటిస్తుంది ఈ భామ. వాటిల్లో ‘మిషన్ మజ్ను’ ఒకటి. ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరో, ఈ చిత్రం పై హిందీలో భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక నటిస్తున్న రెండో హిందీ సినిమా అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రూపొందుతోన్న ‘గుడ్ బై’ సినిమా. కాగా ఈ సినిమా మే 24, 2022న రిలీజ్ కాబోతుంది. అలానే సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన హాట్ పోటోలతో కుర్రకారుని ఫిదా చేస్తుంది. తాజాగా గ్రీన్ డ్రస్ లో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వాటిని మీరు ఓ లుక్కేయండి.

- Advertisement -