Rashmika Mandanna ఆ విషయం ముందే తెలిసుంటే అతనిపై రివేంజ్ తీర్చుకునే దాన్ని అంటున్న రష్మిక మందన్నా… ఎవరంటే ?

Jaya Kumar

Rashmika Mandanna ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. మొదటి సినిమా తోనే హిట్ అందుకుంది ఈ భామ. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన “గీతా గోవిందం”, డియర్ కామ్రేడ్ చిత్రాలలో నటించి తక్కువ కాలంలోనే తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది ఈ కన్నడ బ్యూటీ. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాతో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. ఇక ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో నటించి అందర్నీ మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వచ్చిన సినిమా ” పుష్ప – ది రైజ్ “. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ హిట్ అందుకుంది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక నటించి మెప్పించింది.

ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ నెట్టింట్లో సంచలనం సృష్టించాయి. దక్షిణాదిలోనే కాకుండా.. ఉత్తరాదిలోనూ ఈ మూవీ కలెక్షన్స్ పరంగా ఈ మూవీ రికార్డ్ సృష్టించింది. ఇందులోని పాటలు కూడా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. సామీ సామీ, ఊ అంటావా మావా… ఊహు అంటావా, శ్రీవల్లి పాటలు నెట్టింట్లో దుమ్ములేపుతున్నాయి. ఇక రష్మిక వేసిన సామీ సామీ పాట ఖండాలు దాటిపోయింది. ఈ పాటలకు రష్మిక వేసిన స్టెప్పులను వేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా రష్మిక జిమ్ ట్రైనర్ కుల్దీప్ సేతి కూడా సామీ సామీ పాటకు స్టెప్పులేసేందుకు ట్రై చేశాడు.

అయితే ఈ విషయం తెలుసుకున్న రష్మిక తన ట్రైనర్ మీద సెటైర్ వేసింది. మాములుగా అయితే కుల్దీప్ తన ట్రైనింగ్ సెషన్‏లో వర్కవుట్స్ సరిగ్గా చేయమంటూ రష్మికను టార్చరు పెడుతుంటాడట. అయితే ఇలా సామీ సామీ పాటకు స్టెప్పులు వేస్తాడని తెలిస్తే సామీ స్టెప్పులు నేర్పిస్తూ రివేంజ్ తీర్చుకునేదాన్ని… మంచి ఛాన్స్ మిస్సయ్యాను అంటూ తన ఇన్ స్టాలో షేర్ చేసుకుంది రష్మిక. ప్రస్తుతం రష్మిక పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

- Advertisement -