Genelia : టాలీవుడ్ హీరోయిన్ జెనీలియా, ఆమె భర్త రితేష్ దేశముఖ్ ల గురించి మనందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు. తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు రితేష్, జెనీలియా. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజులుగా జెనీలియా ముచ్చటగా మూడోసారి గర్భం దాల్చింది అంటూ వార్తలు జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. తాజాగా ముంబైలో ఒక ఈవెంట్ కి రితేష్ జెనీలియా ఇద్దరూ హాజరయ్యారు. ఈ క్రమంలోనే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు.
అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోలు వీడియోలలో జెనీలియా కడుపు కొంచెం లావుగా ముందుకు వచ్చినట్టుగా కనిపించడంతోపాటు ఆమె నా పొట్టను కనపడకుండా చేతులతో కవర్ చేసుకుంది. దాంతో జెనీలియా మూడోసారి తల్లి కాబోతోంది గర్భం దాల్చింది త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపించాయి. అయితే, ఈ రూమర్లపై తాజాగా రితేష్ దేశ్‌ముఖ్ స్పందించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశారు. వైరల్ స్క్రీన్ షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసిన రితేష్ దేశ్‌ముఖ్..ఇద్దరు, ముగ్గురు, అంతకంటే ఎక్కువైనా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.
ఆ వార్తల్లో నిజం లేదు…
కానీ దురదృష్టవశాత్తూ ఇందులో నిజం లేదు అంటూ జెనీలియా ప్రెగ్నెన్సీ రూమర్లను కొట్టిపారేశారు. దీంతో అవన్నీ కూడా అవాస్తవాలే అని తేలిపోయింది. కాగా రితేష్ దేశముఖ జెనీలియా దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే.. పెద్ద కుమారుడి పేరు రాహైల్ కాగా.. చిన్న కొడుకు పేరు రియాన్. ప్రస్తుతం రితేష్ బాలీవుడ్ లో పలు సినిమాలలో హీరోగా నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. జెనీలియా కూడా ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది.