Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా ఖుషి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది ఈ సినిమా తర్వాత తన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి సమంత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించినటువంటి సమంతా నేటిజన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ జీవితంలో ఫెయిల్యూర్ అయ్యాను అనుకున్నటువంటి వారికి మీరిచ్చే సలహా ఏంటి అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ ఏదైనా సమస్య వస్తే ఇంతటితోనే నా జీవితం అయిపోయిందని ఎవరూ కూడా అనుకోకూడదు సమస్య ఎలాంటిదైనా ధైర్యంతో ముందడుగు వేయాలి అప్పుడే మనం ఏదైనా సాధిస్తామని ఈమె తెలియజేశారు.
ఈ స్థాయికి వస్తానని అనుకోలేదు…
నేను నా 25 సంవత్సరాల వయసులో జీవితంలో ఈ స్థాయికి వస్తానని అసలు ఊహించలేదు. అలాగే నా జీవితంలో ఇన్ని సమస్యలు ఒడిదుడుకులు వస్తాయని కూడా తాను ఊహించలేదని సమస్యలు ఏదైనా సరే ధైర్యంతో ముందడుగు వేయడం ముఖ్యం అంటూ ఈ సందర్భంగా సమంత చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం సమంత సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తిగా తన వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ క్రమంలోనే ఈమె పలు ప్రదేశాలకు వెళ్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ తన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడమే కాకుండా తన ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకుంటూ ఉన్నారు.