Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచే సక్సెస్ అందుకున్నటువంటి తమన్నా నటుడు నాగచైతన్యను ప్రేమించే పెద్దల సమక్షంలో 2017 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సమంత నాగచైతన్య ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నప్పటికీ మీరు వైవాహిక జీవితం ఎక్కువ కాలం పాటు నిలబడలేదు వీరి పెళ్లి అయినటువంటి మూడు సంవత్సరాలకి విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోయి వీరి కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత వీరి జ్ఞాపకాలు ఉండకూడదన్న ఉద్దేశంతో జ్ఞాపకాలు అన్నిటిని కూడా చెరిపేసుకున్నారు అయినప్పటికీ సమంత మాత్రం నాగచైతన్యను ఇంకా మర్చిపోలేదని ఇప్పటికి తనని ప్రేమిస్తూనే ఉందని తెలుస్తోంది. తాజాగా సమంత ఇన్స్టాగ్రామ్ లో నాగచైతన్య ఫోటోలు కనిపించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సమంత నాగచైతన్యల పెళ్లి ఫోటోలను ఆమె తన ఇంస్టాగ్రామ్ ఆర్చివ్ లో భద్రంగా దాచుకున్నారు.
సమంత నాగచైతన్య కలుసుకోబోతున్నారా…
ఇలా నాగచైతన్యతో పెళ్లి ఫోటోలను సమంత ఇప్పటికీ భద్రంగా దాచుకోవడంతో సమంత నాగచైతన్యని మర్చిపోలేక పోతుందని స్పష్టంగా అర్థమవుతుంది ఇలా ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో తిరిగి సమంత నాగచైతన్య కలుసుకునే అవకాశాలు ఉన్నాయా అందుకే ఇలా సమంత నాగచైతన్య ఫోటోలను ఇంకా దాచి పెట్టుకుందా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదే కనుక నిజమైతే ఇటు సమంతా అభిమానులకు అటు చైతన్య అభిమానులకు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి.