Bigg Boss Season 5 బిగ్ బాస్ సీజన్ 5 ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఇంటి సభ్యులలో ఒకరి గురించి పలు ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమె ఎవరో కాదు… హౌస్‌ లో బోల్డ్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చి… తన అంద చందాలతో ఆకట్టుకుంటూ… లేడీ అర్జున్‌ రెడ్డిలా పేరు తెచ్చుకుంటున్న లహరి. ప్రతి విషయంలో తనదైన యాటిట్యూడ్ చూపిస్తూ ముక్కుసూటిగా మాట్లాడుతుందని మంచి పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ.

కేవలం బిగ్ బాస్ హౌస్‌ లోనే కాకుండా… బయట కూడా తాను అలాగే ఉంటానని చెప్తుంది లహరి. ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లే మాట్లాడుతానని… ఎదుటి వాళ్లని హర్ట్ చేయాలనే ఉద్దేశం తనకి లేదని … అది ఆమె స్వభావం అని అంటుంది. అదే విధంగా తన గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే ముందు ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ… తన అభిరుచులు, అలవాట్లు గురించి వివరించింది. తానెప్పుడూ ఆఫర్స్ కోసం పరుగు పెట్టలేదని… యాంకర్‌గా ఈటీవీ లో కెరియర్ ప్రారంభించినట్లు వెల్లడించింది. అదే విధముగా టీవీ, సినిమా తనకి రెండు కళ్లలాంటివి అని … రెండిటి పట్ల చాలా ఇష్టం ఉన్నట్లు తెలిపింది. కుటుంబ సమస్యల వల్ల వచ్చిన అవకాశాలని సద్వినియోగ పరుచుకోలేక పోయానని లహరి వాపోయింది. ఈ టీవీలో పనిచేస్తున్న తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో అవకాశం వచ్చిందని… ఆ తరువాత మహా న్యూస్ ఛానల్ లో యాంకర్ గా చేసినట్లు చెప్పింది. యాంకర్‌గా చేస్తూనే 15 రోజులు యాంకరింగ్.. మరో 15 రోజులు సినిమాలు చేసేదాన్ని అని అన్నారు.

ఆ సమయంలో ” నైట్ డ్రైవ్ విత్ లహరి ” అనే ప్రోగ్రామ్‌తో బాగా పాపులర్ ద్వారా మంచి పేరు సంపాదించినట్లు చెప్పుకొచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు గెస్ట్ ఆన్సర్ చెప్పలేకపోతే… ఎదురుగా ఉన్న ఓడ్కా తాగాలని … ఒకవేళ సమాధానం చెప్తే యాంకర్ ఓడ్కా తాగాలని ఉండేదని తెలిపింది. ఆ షో మంచి విజయం సాధించడంతో పాటు పలు విమర్శలు కూడా ఎదుర్కొన్నట్లు వివరించింది.

ఆ షోలో భాగంగా ఓడ్కా అని చెప్పి మంచి నీరు తాగే వాళ్ళం అని… అది అసలైన వోడ్కా కాదని అన్నది. కానీ తనకు మాత్రం వైన్ తాగే అలవాటు ఉందని … తాగుబోతుని మాత్రం కాదని లహరి చెప్పింది. అదే విధంగా తనకు పార్టీ లకు వెళ్లే అలవాటు ఉందని… ఐ లవ్ వైన్ అంటూ సెన్సషనల్ కామెంట్స్ చేసింది. తన మీద తనకి బాగా కాన్ఫిడెన్స్ ఎక్కువని… గట్టిగా చెప్పాలంటే బలుపు బాగా ఎక్కువని చెప్పడం విశేషం.

తన కుటుంబ సభ్యులు ఆమెకు పూర్తిగా మద్దతు ఇస్తారని… ఏదైనా డ్రెస్ వేసుకుంటే… ఎందుకు వేసుకున్నావ్ అనే మాట మా ఇంట్లో వినిపించదు… ఏదైనా వేసుకో అంటరాని తెలిపింది. వారిచ్చిన ఫ్రీడమ్‌ని తాను ఎప్పుడు దుర్వినియోగం చేసుకోలేదని చెప్పింది. తాగే విషయం, నాన్ వెజ్ తినే విషయం ఇంట్లో వారికీ తెలుసని… బ్రాహ్మిణ్ కదా అని కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు అడ్డు చెప్పలేదని అన్నది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Jaya Kumar

Hello All, This is Jaya Kumar an enthusiastic writer, I have completed my Journalism & Mass Communications from Acharya Nagarjuna University, Previously worked for ETV Andhra Pradesh & Public Vibe,...

Mail

Published on సెప్టెంబర్ 14, 2021 at 4:29 సా.