Shruthi Hassan: సినీ నటి శృతిహాసన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది. ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే వారు అడిగే ప్రశ్నలకు ఈమె సమాధానాలు చెబుతూ ఉంటారు.
తాజాగా ఒక నెటిజన్ ఈమెను ప్రశ్నిస్తూ తన లవ్ స్టోరీ గురించి అడిగారు మొదటిసారిగా తనకు శంతను ఎక్కడ పరిచయమయ్యారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు శృతిహాసన్ సమాధానం చెబుతూ తనకు శంతను మొదటిసారి ఇంస్టాగ్రామ్ లో పరిచయమయ్యారని తెలియజేశారు. నేను ఆయనని ఫాలో అయ్యేదాన్ని తాను వేసే ఆర్ట్ తనకు ఎంతో బాగా నచ్చడంతో తనని ఫాలో అవుతూ తను వేసే బొమ్మలకు లైక్ కొడుతూ ఉండే దానిని అయితే ఆయన కూడా నన్ను ఫాలో అయ్యారు. నేను చేసే పోస్టులకు లైక్ కొట్టడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని తెలిపారు.
ఇంస్టాగ్రామ్ లో పరిచయం…
ఈ విధంగా మా ఇద్దరి పరిచయం ఇంస్టాగ్రామ్ ద్వారా మాత్రమే జరిగిందని అనంతరం ఒకరితో మరొకరు చాట్ చేసుకుంటూ మాట్లాడుకునే వారిమని తెలియజేశారు. ఇలా తన ప్రేమ గురించి ఈ సందర్భంగా శృతిహాసన్ పలు విషయాలు తెలియజేశారు. అయితే మరొక నెటిజన్ పెళ్లి ఎప్పుడు అంటూ ప్రశ్నించడంతో బోరింగ్ క్వశ్చన్ అంటూ సమాధానం ఇచ్చారు. ఇక ఈమె గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రేమ ఎంతో అద్భుతంగా ఉంటుంది కానీ పెళ్లి మాత్రం నచ్చదు అన్న ధోరణిలో ఈమె పెళ్లి గురించి ఎప్పుడు ప్రశ్నించిన సమాధానం దాటవేస్తూ ఉంటారు ఇక వీరిద్దరూ కూడా సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే.