Viral Photo : ఫోటో చూశారు కదా. చూడగానే దడుసుకున్నారు కదా. వామ్మో ఎంత పెద్దగా ఉంది. అది కొండ చిలువా ఏంటి అని అనుకుంటున్నారా? నిజానికి.. కొండ చిలువలు అలాగే ఉంటాయి కానీ.. అది అసలు పామే కాదు. అవును.. పాము లాగా ఉన్నా అది అసలు పాము కాదు. మరేంటి అంటారా? అక్కడికే వస్తున్నాం. అది ఒక చేప. దాన్ని లొట్టలేసుకుంటూ జనాలు తింటారు. ఆశ్చర్యంగా ఉందా? నిజం.. అది పెద్ద చేప.

దాని పేరు ఏంటో తెలుసా? మలుగు పాపెర. పాపెర చేపల జాతిలో అదో రకం చేప. అయితే.. ఇంత పొడుగ్గా, ఇంత పెద్దగా ఉన్న చేపను మాత్రం అక్కడి స్థానికులు కూడా మొదటి సారి చూస్తున్నారట. ఇటీవల తీవ్రంగా వర్షాలు కురవడంతో.. వాగులు, వంకలు పొంగి పొర్లాయి కదా. దీంతో అందరూ చేపల వేట మొదలు పెట్టారు.
కొత్త నీళ్లకు ఎప్పుడైనా చేపలు ఎదురు వెళ్తాయి. అందుకే.. అందరూ ఎదురెళ్తున్న నీటిలో వలలు పట్టుకొని చేపల వేట కొనసాగిస్తున్నారు. అలా.. నిజామాబాద్ జిల్లాలోని చందూర్ అనే గ్రామంలో నిజాంసాగర్ కాలువలో ఈ పాము లాంటి చేప చిక్కింది. ఇది నాలుగున్నర ఫీట్లు ఉంది. ముందు దీన్ని చూసి పాము అనే అనుకున్నారట. తర్వాత.. ఇది చేప అని తెలిసి నోరెళ్లబెట్టారట. అయితే.. ఈ చేపను దక్కించుకోవడం కోసం చాలామంది పోటీ పడ్డారట. దీని టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.