Soundarya : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు ఎలాంటి ఎక్స్ పోజింగ్ చేయకుండా తమ సెంటిమెంటల్ నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు ప్రముఖ స్వర్గీయ నటి సౌందర్య గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే ఒకప్పుడు సౌందర్య మాదిరిగానే ప్రముఖ సీనియర్ నటి సావిత్రి కూడా ఎలాంటి గ్లామర్ షో చేయకుండానే మహా నటి గా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఇప్పటికీ తెలుగు సినీ ఇండస్ట్రీలో మహానటి సావిత్రి మరియు స్వర్గీయ నటి సౌందర్య పేరు చిరస్థాయిగా నిలిచిపోయాయి.
అయితే నటి సౌందర్య తెలుగు ప్రముఖ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, వంటి స్టార్ హీరోల సరసన నటించింది. అలాగే సినిమా పరిశ్రమకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే దాదాపుగా 100కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించి రికార్డు సృష్టించింది. కానీ దురదృష్టవశాత్తు జరిగినటువంటి విమాన ప్రమాదంలో నటి సౌందర్య కన్నుమూయడంతో ఒక్కసారిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి గురైంది సౌందర్య చనిపోయినప్పటి నుంచి ఆమె స్థానాన్ని ఇప్పటికీ ఎవరూ భర్తీ చేయలేకపోయారు.

అయితే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటి సౌందర్య ఎక్కువగా టాలీవుడ్ ప్రముఖ హీరో విక్టరీ వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటించింది ఈ క్రమంలో వీరిద్దరు కలసి నటించిన పెళ్లి చేసుకుందాం, జయం మనదేరా, పవిత్ర బంధం, దేవీ పుత్రుడు తదితర చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దీంతో వీరిద్దరి జోడీ కి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఈ క్రమంలో వీరిద్దరికీ మంచి స్నేహ బంధం ఏర్పడింది. దీంతో హీరో వెంకటేష్ మరియు సౌందర్య తమ ఇళ్లలో జరిగే వేడుకలకు ఇరువురు హాజరయ్యే వాళ్ళు. దాంతో కొందరు వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని అప్పట్లో వాళ్లు అసత్య ప్రచారాలు చేశారు అయినప్పటికీ నటి సౌందర్య మాత్రం ఈ విషయం గురించి అప్పట్లో స్పందిస్తూ విక్టరీ వెంకటేష్ తనకు మంచి స్నేహితుడని తమ మధ్య ఎలాంటి ప్రేమ, గీమ లేదని స్పష్టం చేసింది. దీంతో హీరో విక్టరీ వెంకటేష్ మరియు సౌందర్య ల మధ్య ప్రేమాయణం నడుస్తుందని వినిపించిన వార్తలకి పులిస్టాఫ్ పడింది.
అయితే నటి సౌందర్య చనిపోయిన తర్వాత ఆమె భర్త సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి మరో మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా ఆ మధ్య సౌందర్య తల్లిదండ్రులు తమకు సంబంధించిన ఆస్తులను సౌందర్య భర్త రఘు కాజేశాడని కోర్టులో కేసు కూడా వేశారు. దీంతో ఇప్పటికీ ఈ ఆస్తి తగాదాలు కోర్టులోనే ఉన్నట్లు సమాచారం. కాగా తెలుగు ప్రముఖ హీరోయిన్ మరియు నటి సౌందర్య స్నేహితురాలు ఆమని సౌందర్య బ్రతికున్నప్పుడు బెంగళూరులోని కర్ణాటక ప్రాంతంలో నివాసం ఉన్న ఇల్లు గురించి స్పందిస్తూ మెయింటినెన్స్ లేకపోవడంతో దీనస్థితిలో చేరుకుందని ఆవేదన వ్యక్తం చేసింది. ఏదేమైనప్పటికీ ఒకప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మహానటి సావిత్రి ఎంతగా పాపులర్ అయిందో 90’స్ కాలంలో సౌందర్య కూడా అంతే పాపులర్ అయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.