South Director : నన్ను చీప్‌గా చూస్తూ దారుణంగా ప్రవర్తించేవాడు.. సౌత్ దర్శకుడిపై నటి తీవ్ర వ్యాఖ్యలు!

Akashavani

South Director : సాధారణంగా సినీ ప్రపంచం అన్నాక.. సినీ ఆఫర్ల కోసం ఎదురుచూసే సెలబ్రిటీలకు క్యాస్టింగ్ కౌచ్ సెగ తగులుతూనే ఉంటుంది. కొందరు సెలబ్రిటీలు తాము ఎలాగైనా కెరీర్ పరంగా ముందుకు వెళ్లాలి అనుకున్న వాళ్లు వీటిని యాక్సెప్ట్ చేసి మరో లెవెల్ కి వెళ్ళిపోతారు. ఇక మరికొందరు వీటిని యాక్సెప్ట్ చేయలేక ఇక ఎవరికీ చెప్పుకోలేక వారిలో వారే కుమిలిపోతూ ఉంటారు.

ఈ క్రమంలో ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు మోసపోయి వెలుగులోకి వచ్చారు. మరికొందరు మాత్రం ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇక సినిమాల్లో నటించడానికి ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ.. చిన్న స్థాయి సెలబ్రిటీలకు మాత్రం క్యాస్టింగ్ కౌచ్ బాధ తప్పడం లేదు. అలా గతంలో తాను ఎదుర్కొన్న ఒక చేదు అనుభవాన్ని పంచుకుంది ఓ నటి. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ నటి నిక్కీ తంబోలి. ఈమె హిందీ బిగ్ సీజన్ 14 లో పాల్గొని సెకండ్ రన్నరప్ గా నిలిచింది.

ఈ షో ద్వారా ఈ ముద్దుగుమ్మ ఎంతో ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాకుండా ఎన్నో అవకాశాలు కూడా అందుకుంది. ఇక ఇటీవల ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు ఎదురైన ఒక చేదు అనుభవాన్ని తెలిపింది. తనకి ఇప్పటికీ గుర్తుంది అంటూ.. ఓ సౌత్ డైరెక్టర్ తనతో ప్రవర్తించిన తీరు తనకు అస్సలు నచ్చలేదు అని.. సెట్స్ లో తనతోపాటు ఉన్న డాన్సర్స్ అందర్నీ మెచ్చుకుంటాడని.. తనను మాత్రం ఎక్కడి నుంచి వస్తారో నీలాంటి వాళ్లు అంటూ చులకన చేసి మాట్లాడేవాడట.

South Director : నన్ను చీప్‌గా చూస్తూ దారుణంగా ప్రవర్తించేవాడు.. సౌత్ దర్శకుడిపై నటి తీవ్ర వ్యాఖ్యలు!
South Director : నన్ను చీప్‌గా చూస్తూ దారుణంగా ప్రవర్తించేవాడు.. సౌత్ దర్శకుడిపై నటి తీవ్ర వ్యాఖ్యలు!

South Director : ఇప్పటికీ అతడు తనకు మెసేజ్ చేస్తూనే ఉంటాడట..

ఇక అప్పుడు తనకు అక్కడి భాష మాట్లాడటానికి వచ్చేది.. కానీ అతడు మాత్రం చాలా చెత్తగా ప్రవర్తించాడు అని.. విదేశాల్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో తనను చీఫ్ గా చూస్తూ దారుణంగా ప్రవర్తించేవాడు అని అన్నది. అంతేకాకుండా తన ఇంటికి వచ్చాక చాలా ఏడ్చేదాన్ని అని.. అయినా కూడా వెనుకడుగు వేయలేదు అంటూ.. ఎందుకంటే ఎప్పటికైనా అతడు తన తప్పు తెలుసుకొని ఫీల్ అవుతాడు అని అనుకున్నానని తెలిపింది. ఇప్పటికీ అతడు తనకు మెసేజ్ చేస్తూ ఉంటాడు అని.. కాలం అన్నింటినీ మార్చేస్తుంది అని తెలిపింది.

- Advertisement -