Sreeleela: పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమయ్యారు నటి శ్రీ లీల. ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె ఈ సినిమాతో పెద్దగా సక్సెస్ అందుకో లేకపోయినా తన నటనతో మాత్రం అందరిని ఆకట్టుకున్నారు. ఈ సినిమా అనంతరం ఈమె రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో శ్రీలకు భారీ స్థాయిలో అభిమానులు పెరిగిపోయారు. దీంతో ఈమెకు వరుసగా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి.
ప్రస్తుతం ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుంచి మొదలుకొని యంగ్ హీరోల వరకు వరుసగా సినిమాలలో నటిస్తున్నారు. దాదాపు పది సినిమా అవకాశాలను అందుకొని సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్రీలీల తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తనకు కాబోయే భర్త గురించి పలు విషయాలను తెలియజేశారు. తనకు కాబోయే భర్త ఎలాంటి క్వాలిటీస్ తో ఉండాలి అనే విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను తన ఫస్ట్ లవ్ తన తల్లితోనే పడ్డానని అమ్మ అంటే తనకు ఎంతో ప్రేమ అంటూ తెలియజేశారు.
సరదాగా ఉండాలి…
ఇక తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి విషయానికి వస్తే ఆయన మాటమీద నిలబడే వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు అయి ఉండాలి అందరితో కలుపుగోలుగా సరదాగా మాట్లాడుతూ ఉండాలి ప్రతి ఒక్క విషయంలోను ఎంతో ఓర్పుగా ఉండాలి. వీటన్నింటితో పాటు పెద్దలను గౌరవించడం ఎంతో అవసరం అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తిని తాను భర్తగా కోరుకుంటాను అంటూ ఈ సందర్భంగా శ్రీ లీల తనకు కాబోయే భర్తలు ఉండాల్సిన లక్షణాలు గురించి చెబుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.