Sridevi Drama Company: మల్లెమాల వారు బుల్లితెర పై ప్రసారం చేస్తున్న కార్యక్రమాలలో కామెడీ షోలు అయినటువంటి జబర్దస్త్,శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలను మల్లెమాల వారు నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే. శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా జబర్దస్త్ కమెడియన్స్ పాల్గొని ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారం కానుంది. మొదట్లో పెద్దగా ఈ కార్యక్రమం ప్రేక్షకాదరణ పొందక పోయినా ప్రస్తుతం అద్భుతమైన రేటింగ్ అందుకుంది.
ఇక ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా ఇంద్రజ యాంకర్ గా సుడిగాలి సుదీర్ వ్యవహరించేవారు.అయితే ప్రస్తుతం సుడిగాలి సుదీర్ ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలోకి రష్మీ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చారు. అలాగే నటి ఇంద్రజ స్థానంలో పూర్ణ జడ్జిగా హాజరయ్యారు. తాజాగా ఈ ఆదివారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా వేదికపై రష్మీ కళ్ళు తిరిగి పడిపోయినట్టు చూపించారు.ఈ క్రమంలోనే ఈ ప్రోమో వైరల్ గా మారడంతో కొంతమంది అసలు రష్మీ ఎందుకు అలా పడిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

Sridevi Drama Company: షో రేటింగ్ కోసమే…
ఈ క్రమంలోనే మరికొంతమంది నెటిజెన్స్ ఈ ప్రోమో పై స్పందిస్తూ.. ఇదంతా కేవలం ప్రోమో హైలెట్ చేయడం కోసమేనని, ఎపిసోడ్ పై హైప్ రావడం కోసమే నిర్వాహకులు ఇలా ప్రోమో కట్ చేశారని పెద్దఎత్తున కామెంట్లు చేస్తూ మల్లెమాల వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రోమో ద్వారా ఈ కార్యక్రమం పై ఆతృత కల్పించడం కోసమే ప్రోమోలో రష్మి కళ్ళు తిరిగి పడిపోయినట్టు చూపించారు. మల్లెమాల వారు ఇదివరకు ఇలాంటి ట్రిక్స్ ఎన్నో ప్లే చేసి చివరికి ప్రేక్షకులను ఫూల్స్ చేస్తున్నారు. కేవలం ఈ షో టిఆర్పి రేటింగ్స్ కోసం మాత్రమే మల్లెమాల వారు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఇంకా ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎన్ని ప్లే చేస్తారంటూ నెటిజన్లు పెద్దఎత్తున మల్లెమాల వారిపై ఓ రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు.