Tamannah: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి తమన్న ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస భాషా సినిమాలలో నటించడమే కాకుండా వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా నటిగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. ఇలా ప్రేమలో ఉన్నటువంటి తమన్న ప్రేమ గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. అయితే ఈమె విజయ్ కంటే ముందుగానే మరొక హీరోతో ప్రేమలో మునిగి తేలిందని అయితే వీరి పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పడంతోనే బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తోంది.
ఈ విధంగా తమన్న ప్రేమకు బ్రేకప్ చెప్పినటువంటి ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు కార్తీ తమన్నా కలిసి ఆవారా సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. అయితే ఈమె ప్రేమలో ఉన్నటువంటి కార్తీక్ చెన్నైలో తమన్నా కోసం కోట్ల విలువ చేసే ఒక ఫ్లాట్ కొనుగోలు చేసి తనకు కానుకగా ఇచ్చారట అయితే ఆ ఫ్లాట్ ఇప్పటికీ తమన్న వద్దే ఉందని తెలుస్తుంది.
కార్తీ ప్రేమలో తమన్నా…
ఇక తమన్నా విషయం కార్తీ ఇంట్లో తెలియటంతో తన తండ్రి వీరి పెళ్లికి అడ్డు చెప్పారట ఇప్పటికే ఒక హీరోయిన్ కోడలుగా ఇంటికి అడుగుపెట్టింది దాంతో మరొక కోడలు కూడా హీరోయిన్ కావడానికి వీలు లేదు అని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితులలో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని తెలుస్తుంది. ఇలా బ్రేకప్ తర్వాత తమన్న తన ఫ్లాట్ కార్తీకి తిరిగి వెనక్కి ఇచ్చేయాలని ప్రయత్నించినప్పటికీ ఆయన మాత్రం తీసుకోలేదట. ఇక తమన్నతో బ్రేకప్ చెప్పిన అదే ఏడాది శివకుమార్ తన కుమారుడు కార్తీ కు తమ సమీప బంధువు అయినటువంటి రజనీతో వివాహం జరిపించారు.