Priya : కొంతమంది నటీనటులకి వచ్చీ రాగానే మంచి ఆరంభం లభించినప్పటికీ తమ తదుపరి చిత్ర కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో కెరియర్ లో సరైన హిట్ లేక సతమతవుతున్న నటీనటులు ఇండస్ట్రీ లో చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఆ ఆమధ్య మలయాళ చిత్ర పరిశ్రమలో ఓరు ఆధార్ లవ్ (తెలుగులో లవర్స్ డే) అనే చిత్రం ద్వారా కెరియర్ ని ఆరంభించిన మలయాళీ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియ ప్రకాష్ వారియర్ కూడా ఈ కోవకే చెందతుంది.
అయితే ఈ అమ్మడు తన మొదటి చిత్రంలో కన్ను గీటే సన్నివేశాలతో మరియు లవ్ సన్నివేశాలలో నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే అప్పుడప్పుడే సోషల్ మీడియా ప్రభావం కూడా పెరుతుండడంతో ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. దీంతో చిన్న వయసులోనే ఈ అమ్మడు కొంతకాలంపాటు ఒక పక్క సినిమాల్లో ఆఫర్లు దక్కంచుకుంటూనే మరోపక్క పలు వాణిజ్య సంస్థల ప్రకటనలలో కూడా నటిస్తూ బాగానే సంపాదించుకుంది. కానీ ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ కి ఆఫర్లు కరువైనట్లు సమాచారం.
దీంతో ప్రస్తుతం ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు లేకపోవడంతో సెలవులను గడిపేందుకు ఇతర దేశాలకి వెళ్ళింది. ఈ క్రమంలో బీచ్, రిసార్ట్స్ అంటూ తెగ ఎంజాయ్ చేస్తోంది. అంతటితో ఆగకుండా ఈ అమందు స్విమ్మింగ్ పూల్స్ లో బికినీ దుస్తులు ధరించి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కుర్రకారుకి కునుకు లేకుండా చేస్తోంది ఈ మలయాళీ బ్యూటీ. దీంతో ఈ అమ్మడి లేలేత అందాలకి నెటిజన్లు ఫిధా అయ్యారు. అలాగే ప్రియా ప్రకాష్ వారియర్ కి ఇప్పటికీ సమయం మించిపోలేదని సరైన హిట్ పడితే మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కి అభిమానులను అలరిస్తుందని కామెంట్లు చేస్తునారు.
అయితే ఈ మధ్య కాలంలో నటి ప్రియ ప్రకాష్ వారియర్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న పోటోల కారణంగా సినిమా ఆఫర్లు పెద్దగా వరించకపోయినప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ మాత్రం బాగానే పెరుగుతోంది. దీంతో అప్పుడప్పడు ఈ బ్యూటీ ప్రమోషనల్ యాడ్స్ లో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తోంది. ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నటి ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగులో చెక్, ఇష్క్ అనే చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. కానీ ఇందులో కనీసం ఒక్క చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి.