Sindhu menan : వామ్మో చందమామ హీరోయిన్ ఏంటి ఇలా అయిపోయింది…

Joythi R

Sindhu menan : వచ్చి రావడంతోనే టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి తనకంటూ కొంత మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి ఇతర భాష సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే బ్యూటిఫుల్ హీరోయిన్ అనుష్క శెట్టి, సాయి పల్లవి, కాజల్ అగర్వాల్ తదితర హీరోయిన్లు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కాకపోయినప్పటికీ టాలీవుడ్ లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో ఇక్కడే వరుసగా సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ సెటిల్ అయిన వాళ్లు కూడా లేకపోలేదు.  అయితే తెలుగులో చందమామ అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నటువంటి తెలుగు బ్యూటిఫుల్ హీరోయిన్ సింధు మీనన్ కూడా ఈ కోవకే చెందుతుంది.

 

అయితే ఈ అమ్మడు కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన నటి అయినప్పటికీ టాలీవుడ్ లోనే ఎక్కువ చిత్రాల్లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో చందమామ, వైశాలి, సిద్ధం, త్రినేత్రం, అలాగే మరిన్ని చిత్రాల్లో నటించింది. అయితే నటి సింధు మీనన్ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మలయాళం మరియు తమిళ భాషలలో కూడా పలు చిత్రాలలో నటించింది. దీంతో కొన్ని సంవత్సరాల పాటు పలు వరుస సినిమా ఆఫర్లతో బిజీ బిజీ గా నటించిన సింధు మీనన్ 2010వ సంవత్సరంలో ప్రభు అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇక అప్పటి నుంచి నటి సింధు మీనన్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద యాక్టివ్ గా ఉండటం లేదు. దీంతో ప్రస్తుతం తన భర్తకి వ్యాపారాల్లో చేదోడుగా నిలుస్తోంది. అయితే వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. దీంతో ఇటీవల నటి సింధు మీనన్ తన భర్త పిల్లలతో కలిసి దిగినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు  ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతేకాకుండా పెళ్లికి ముందు చాలా అందంగా ఉన్నటువంటి సింధు మీనన్ ఒక్కసారిగా పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

ఈ విషయం ఇలా ఉండగా నటి సింధు మీనన్ తెలుగు, తమిళం, మలయాళం భాషలలో దాదాపు 20కి పైగా చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించింది. అయితే ఆ మధ్య నటి సింధు మీనన్ పై మనీ చీటింగ్ కేసు కూడా బెంగళూరులో నమోదైంది. కానీ ఆ తర్వాత కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో ఈ కేసు సెటిల్ చేసినట్లు సమాచారం.

- Advertisement -