Sri-Reddy-cooked-shark-curry-video-going-viral-on-social-media

Sri Reddy:టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమంలో క్యాస్టింగ్ వివాదంపై సంచలన వ్యాఖ్యలు మరియు ఉద్యమాలు చేస్తూ బాగానే పాపులర్ అయినటువంటి తెలుగు ప్రముఖ నటి శ్రీరెడ్డి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి శ్రీరెడ్డి స్వతహాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతి అయినప్పటికీ ఆఫర్ల విషయంలో పలు ఇబ్బందులను ఎదుర్కొంది అందుకే నటిగా తన ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశాలు దక్కలేదు. దీంతో కడుపుమంటతో ఈ అమ్మడు క్యాస్టింగ్ కౌచ్ వివాదంపై ఉద్యమం చేయగా ఒక్కసారిగా సంచలనంగా మారింది.

ఆ తర్వాత టాలీవుడ్ సినీ పరిశ్రమ బహిష్కరణకు గురవడంతో తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైకి మకాం మార్చింది. ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో నటి శ్రీరెడ్డి సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే ఎక్కువగా ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అప్పుడప్పుడు వంటలకు సంబంధించిన వీడియోలు అలాగే పలు ఆరోగ్య చిట్కాలు వంటివి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులను బాగానే ఆకట్టుకుంటుంది. అయితే ఇటీవలే తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఈ విషయంపై నటి శ్రీరెడ్డి కొంతమేర వ్యంగంగా విమర్శలు చేస్తూ ఎద్దేవా చేస్తోంది.

ఇక టాలీవుడ్ ప్రముఖ హీరో, అలాగే జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై కూడా ఎప్పుడూ ఘాటుగా విమర్శలు చేస్తూ అసభ్యకర పదజాలంతో దూషిస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కొందరు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కామెంట్లు చేసినాసరే శ్రీ రెడ్డి ఏకంగా తనదైన శైలిలో స్పందిస్తూ ఘాటుగా రిప్లై ఇస్తూ ఉంటుంది. అయితే తాజాగా నటి శ్రీరెడ్డి అందాలు ఒలకబోస్తూ ఓ వీడియో చేసింది. ఈ వీడియోకి చాలామంది శ్రీ రెడ్డి అందంగా ఉందని అలాగే హీరోయిన్ పీస్ అని, కానీ తన ప్రతిభను నిరూపించుకోవడానికి సరైన అవకాశం రాకపోవడంతో అలా మిగిలిపోయిందని కామెంట్లు చేశారు. కానీ ఓ నెటిజన్ ఏకంగా శ్రీ రెడ్డి ని నీ బ్రా సైజు ఎంతని అసభ్యకరంగా అడిగాడు. దీంతో శ్రీరెడ్డి తనదైన శైలిలో స్పందిస్తూ నీ తాటికాయ మొహం సైజు అంత అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.